వైష్ణవ్ తేజ్ మూవీలో విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో..!

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రానికి సంబందించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. బుచ్చిబాబుకి కూడా డైరెక్టర్ గా ఇదే మొదటి చిత్రం. ఇక ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ జాలరిగా కనిపించబోతున్నాడట. ఇది ఓ యదార్ధ ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కబోతున్న చిత్రమని తెలుస్తుంది. మ‌త్య్స‌కారుల‌ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథ కచ్చితంగా అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతుందట.

‘మైత్రీ మూవీ మేకర్స్’ ‘సుకుమార్ రైటింగ్స్’ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కాంబినేషన్ కాబట్టి ఈ చిత్రం పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో విలన్ పాత్ర చాలా కీలకమైందట. దీని కోసం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని తీసుకున్నట్టు తాజా సమాచారం సమాచారం. ఈ తరహా పాత్రకు విజయ్ సేతుపతి సరిగ్గా సరిపోతాడనే నమ్మకంతోనే చిత్ర యూనిట్ భావిస్తోందట. అయితే ఈ చిత్రంలో నటించడానికి విజయ్ ఒప్పుకుంటారా అనే డౌట్ అందరికీ కలుగక మానదు. అయితే ‘సైరా’ షూటింగ్ సమయంలో వైష్ణవ్ తేజ్ చిత్రంలో నటించమని మెగాస్టార్ చిరంజీవి.. విజయ్ సేతుపతిని అడగడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. దీంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ రావడంతో పాటూ.. వైష్ణవ్ ఎంట్రీకి కూడా కలిసొచ్చే అంశం అనడంలో సందేహం లేదు. ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus