కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది స్టార్ హీరోలకు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. తెలుగు, హిందీ భాషల్లో కోలీవుడ్ హీరోల సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుండటంతో ఈ హీరోలు భారీగా రెమ్యునరేషన్లను సొంతం చేసుకుంటున్నారు. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది స్టార్ హీరోలు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికంగా తీసుకుంటూ ఉండటం గమనార్హం. సూపర్ స్టార్ రజనీకాంత్ కు భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తెలుగులో రజనీకాంత్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. రజనీకాంత్ సినిమాలకు తెలుగులో హిట్ టాక్ వస్తే ఇక్కడి స్ట్రెయిట్ హీరోలకు సమానంగా రజనీకాంత్ సినిమాలకు కలెక్షన్లు వస్తాయనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు రజనీకాంత్ 140 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారు. సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరో ప్రభాస్ కావడం గమనార్హం. సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించకపోతే రజనీకాంత్ రెమ్యునరేషన్ లో కొంత మొత్తం తిరిగిచ్చేస్తారు.
ఈ కారణం వల్లే ఆయనతో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు కూడా ఆసక్తి చూపుతారు. మరో స్టార్ హీరో విజయ్ కూడా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికంగా తీసుకుంటున్నారు. విజయ్ ఖాతాలో ఒక్క పాన్ ఇండియా హిట్ కూడా లేకపోయినా తమిళనాడులో విజయ్ ను అభిమానించే అభిమానులు ఊహించని స్థాయిలో ఉన్నారు. విజయ్ గత సినిమా బీస్ట్ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. టాలీవుడ్ విషయానికి వస్తే ప్రభాస్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
ప్రభాస్ ఒక్కో సినిమాకు 125 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కోలీవుడ్ హీరోలు తమ తర్వాత ప్రాజెక్ట్ లు సైతం సంచలన విజయాలు సాధించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే ఈ సెలబ్రిటీల పారితోషికాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?