శృతిమించిన హీరో లిప్ లాక్ కు… షూటింగ్ క్యాన్సిల్..!

హీరో, హీరోయిన్ల మధ్య ముద్దు సన్నివేశాలు ఈ మధ్య సర్వ సాధారణం అయిపోయాయి. ఈ సన్నివేశాల గురించి ముందుగానే హీరోయిన్ కు దర్శకులు వివరిస్తున్నారు. వాటికి ఓకే చెప్పిన వాళ్ళనే హీరోయిన్లుగా ఫైనలైజ్ చేస్తున్నారు. అయితే అవి నచ్చని హీరోయిన్లు నో చెప్పేసి తప్పుకుంటున్నారు కూడా. ఈమధ్య కాలంలో హీరోయిన్ సాయి పల్లవికి.. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో అవకాశం వచ్చినప్పటికీ.. లిప్ లాక్ సీన్లు ఎక్కువగా ఉన్నాయని ఆమె నో చెప్పిందట. ఇది పక్కన పెడితే.. కోమలి సిస్టర్స్ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసే ఉండి ఉంటుంది. టీనేజ్ లోనే వారి మిమిక్రి టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.

ఇప్పుడు వీరిలో పెద్దమ్మాయి అయిన హిరోషిణి ఇటీవల ఓ సినిమాలో హీరోయిన్ గా చేయడానికి రెడీ అయ్యింది. చిత్రీకరణలో ఓ లిప్ లాక్ సీన్ ఉందట. దీనికి కూడా హీరోషిణి అంగీకరించింది. అయితే లిప్ లాక్ చేస్తున్నప్పుడు.. హీరోగారు పెదాలను మాత్రమే కాకుండా నాలుకను తాకుతూ స్మూచ్ కిస్ ఇచ్చే ప్రయత్నం చేసాడట. ‘లిప్ లాక్ అంటే ఎదో పెదాలను మాత్రమే తాకుతూ ఉంటుందని’ అనుకుంటే అది శృతి మించిందని… షూటింగ్ మధ్యలోనే వీళ్ళిపోయిందట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

1

2

3

4

5

6

7

8

9

10

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus