Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో ఎక్కువగా హైలైట్‌గా నిలుస్తున్న శపథం ‘మా సినిమా నచ్చకపోతే..’ అనే మాట. అంటే ఇప్పుడు వస్తున్న సినిమా నచ్చకపోతే తర్వాత సినిమా చూడొద్దనో, లేక తన మాట నమ్మొద్దనో హీరోలు, సాంకేతిక నిపుణులు, రైటింగ్‌ టీమ్‌ అనడం చూసే ఉంటారు. అందులో చాలా వరకు శపథాలు సక్సెస్‌ అవుతున్నాయి. ఆ సినిమాలు మంచి విజయాలు అందుకుంటున్నాయి. అలా జరుగుతోందనో, లేక ఈ సినిమా నమ్మకమో కానీ ప్రముఖ రచయిత కోన వెంకట్‌ కూడా ఇలాంటి స్టేట్‌మెంటే ఇచ్చారు.

Kona Venkat

ఆయన నిర్మాణ సారథ్యంలో రూపొందిన సినిమా ‘బ్యాండ్‌ మేళం’. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పైన చెప్పిన స్టేట్‌మెంటే ఇచ్చారు. అయితే మళ్లీ నాలుక కరచుకుని ‘చిరంజీవి ఫోన్‌ చేసి ఏమంటారో ఏమో’ అని నవ్వేశారు. ఆయన సినిమాకు, చిరంజీవి సినిమాకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఉంది.. ఇప్పుడు అదే హాట్‌ టాపిక్‌ కూడా. చిరంజీవి నెక్స్ట్ సినిమా రైటింగ్‌ టీమ్‌లో కోన వెంకట్‌ ఉన్నారు అని అలా తెలిసింది. నెక్స్ట్‌ సినిమా అంటే కేఎస్‌ రవీంద్ర (బాబీ) సినిమా అని మీకు అర్థమయ్యే ఉంటుంది.

కోన వెంకట్‌.. టాలీవుడ్‌లో కామెడీని ఓ ఆటాడుకున్న రచయితల్లో కోన వెంకట్‌ ఒకరు. శ్రీను వైట్లతో కలసి ఆయన చాలా సినిమాలకు పని చేశారు. ఆయన నుండి దూరమైన తర్వాత బాబీతో కసలి సినిమాలు చేశారు. చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు కోన వెంకట్‌ కూడా రాశారు ఇప్పుడు కొత్త సినిమాకు కూడా బాబీ ఆయన రచనా సహకారం తీసుకుంటున్నారు అని తేలింది.

అసలు కోన ఏం స్టేట్మెంట్‌ ఏం ఇచ్చారంటే.. ‘బ్యాండ్ మేళం’ సినిమా నచ్చకపోతే తర్వాత తాను రైటర్‌గా పని చేసే సినిమా చూడొద్దన్నారు. అయితే ఈ మాట వింటే రేప్పొద్దున చిరంజీవి ఫోన్ చేసి తిడతారు. ఎందుకంటే తాను తర్వాత రాయబోయే సినిమా ఆయనదే అని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈసినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ సెకండాఫ్‌లో స్టార్ట్‌ అవుతుంది అని అంటున్నారు. త్వరలో సినిమాకు కొబ్బరికాయ కొడతారని సమాచారం.

కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus