టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరనే సంగతి తెలిసిందే. కొరటాల శివ తొమ్మిదేళ్ల సినీ కెరీర్ లో కేవలం 5 సినిమాలను తెరకెక్కించారు. ప్రభాస్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన మిర్చి 2013లో రిలీజ్ కాగా కొరటాల శివ రెండో సినిమా శ్రీమంతుడు 2015లో రిలీజైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన తర్వాత సినిమా జనతా గ్యారేజ్ 2016లో విడుదల కాగా భరత్ అనే నేను 2018 సంవత్సరంలో విడుదలైంది.
అయితే భరత్ అనే నేను సినిమా తర్వాత కొరటాల శివ చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో ఆచార్య మూవీతో బిజీ అయ్యారు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల అంతకంతకూ ఆలస్యమైన ఆచార్య ఎన్నో ఇబ్బందులను దాటుకుని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన రిలీజ్ కానుంది. ఆచార్య షూటింగ్ అంతకంతకూ ఆలస్యం కావడం కొరటాల శివను చాలా బాధ పెట్టిందని సమాచారం. అయితే వచ్చే ఏడాది కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ఫిబ్రవరిలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్న కొరటాల శివ వేగంగా ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి 2022 సంవత్సరం దసరాకు ఆ సినిమాను రిలీజ్ చేయాలని కొరటాల శివ భావిస్తున్నారు. వచ్చే సంవత్సరం కొరటాల శివ డబుల్ ధమాకా ఇస్తుండటం గమనార్హం. కొరటాల కెరీర్ లో తొలిసారి ఒకే సంవత్సరం రెండు సినిమాలు రిలీజ్ అవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొరటాల శివ వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!