Janhvi Kapoor: జాన్వీ కపూర్ పై ఫైర్ అయిన దర్శకుడు కొరటాల శివ!

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న రాత్రి 7 గంటలకు విడుదల చేసారు. ఈ చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్ ని పెట్టగా ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్విట్టర్ లో ఎన్టీఆర్ అకౌంట్ నుండి విడుదల చెయ్యబడ్డ ఈ సినిమా ఫస్ట్ లుక్ కి అతి తక్కువ సమయం లోనే 44 వేల రీట్వీట్స్ మరియు లక్ష 20 వేల లైక్స్ ని సొంతం చేసుకుంది.

టాలీవుడ్ లో ఇది ఫాస్టెస్ట్ రికార్డు అట. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసుకున్న సెలెబ్రేషన్స్ ని మరింత రెట్టింపు అయ్యేలా చేసింది ఈ ఫస్ట్ లుక్ పోస్టర్. ఇది ఇలా ఉండగా ఈ చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఈ చిత్రం షూటింగ్ సమయం లో ఎన్టీఆర్ కారణంగా చాలా ఇబ్బందులను ఎదురుకోవాల్సి వస్తుందట. ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్టు అనే విషయం అందరికీ తెలిసిందే, ఆయనతో పని చేసిన ప్రతీ దర్శకుడు చెప్పే మాట ఇది.

ఇదే ఇప్పుడు (Janhvi Kapoor) జాన్వీ కపూర్ కి పెద్ద సమస్య గా మారిపోయింది. ఎన్టీఆర్ వేగాన్ని ఆమె అందుకోలేకపోతుందట. ఆయన నటనని లైవ్ గా చూసి బయపడి అప్పటి వరకు చెప్పాలనుకున్న డైలాగ్స్ ని కూడా మర్చిపోతుందట, అందువల్ల ఎక్కువ టేక్స్ తీసుకోవాల్సి వస్తుందని, షూటింగ్ డేస్ పొడిగించుకుంటూ పోవాల్సి వస్తుందని కొరటాల శివ చిరాకు పడుతున్నాడట. దీనితో జాన్వీ కపూర్ షూటింగ్ రావడానికే బయపడుతుందని సమాచారం. ఎన్టీఆర్ వేగం జాన్వీ కపూర్ కి ఇంత కష్టం తెచ్చిపెట్టింది అన్నమాట.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus