కొరటాల శివ నెక్స్ట్ హీరో అతనే

అఖిల్ సినిమాతో అక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరోగా లాంచ్ అయినప్పటికీ మంచి ఫలితాన్ని అందుకోలేకపోయారు. తర్వాత హలో సినిమాలో బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇచ్చి హిట్ అందుకున్నారు. ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించడానికి ఒకే చెప్పారు. ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఎస్.ఎస్. థమన్ స్వరాలూ కూర్చే పనిలో బిజీగా ఉండగా… అఖిల్, డైరక్టర్ తో కలిసి థాయ్ ల్యాండ్లో లొకేషన్స్ వెతికే పనిలో పడ్డారు. బీవీఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ

ఈనెల చివరివారం నుంచి సెట్స్ మీదకు వెళుతుంది. ఇక దీని తర్వాత సినిమా కూడా ఫిక్స్ అయినట్లు తెలిసింది. వరుస హిట్లతో టాలీవుడ్ టాప్ డైరక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. భరత్ అనే నేను సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న కొరటాల వెంటనే డైరక్ట్ చేయడానికి స్టార్ హీరోలందరూ బిజీగా ఉన్నారు. సో అఖిల్ కి బిగ్ హిట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. కొరటాల కథ రాసుకున్నప్పటికీ ఇంకా అఖిల్ కి చెప్పలేదంట. పూర్తి స్క్రిప్ట్ అయిన తర్వాత నాగ్, అఖిల్ కి ఒకేసారి వినిపించనున్నారు. ఈ సినిమాకి నిర్మాత మాత్రం ఇప్పుడే ఫిక్స్ అయ్యారు. యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus