గత రెండు రోజులుగా ఆచార్య మూవీపై టాలీవుడ్ లో తీవ్ర చర్చ నడుస్తుంది. ఆచార్య మూవీ కథ నాదే అని తన అనుమతి లేకుండా దర్శకుడు కొరటాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఆయన ఆరోణపణలు మీడియాలో ప్రముఖంగా రావడంతో దర్శకుడు కొరటాల శివ మరియు నిర్మాతలు స్పందించడం జరిగింది. ముఖ్యంగా కొరటాల ఓ టీవీ ఛానల్ ద్వారా, ఆచార్య మూవీ కథ కాపీ అని వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని, అది పూర్తిగా కొత్త కథ కావడంతో పాటు తానే స్వయంగా రాసుకున్నానని తెలియజేశారు.
ఇలాగే నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని హెచ్చరించారు. కొరటాల ఆచార్య కథ తనదే అని నొక్కి వక్కాణించడం జరిగింది. ఐతే గతంలో దర్శకుడు కొరటాల శివ కూడా కొందరు దర్శకులపై ఇలాగే తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. కథ కథనాలు అందిస్తే, కనీసం క్రెడిట్ ఇచ్చేవారు కాదని అన్నారు. అలాగే మా టాలెంట్ ని తమ టాలెంట్ గా ప్రొజెక్ట్ చేసుకునే వారని చెప్పడం జరిగింది.
రచయితగా ఉన్నప్పుడు తాను పనిచేసిన దర్శకుల గురించి ఆయన ఈవ్యాఖ్యలు చేయడం జరిగింది. దర్శకుడిగా రెండు హిట్లు కొట్టినాక కొరటాల ఈ ఆరోపణలు చేయడం విశేషం. ఒకప్పుడు కొరటాల చేసిన ఆరోపణలు, కొరటాలపై మరో రచయిత చేయడం గమనార్హం. ఇక ఆచార్య మూవీ షూటింగ్ వచ్చే ఏడాది మొదలుకానునట్లు సమాచారం.