Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Advertisement

‘మిర్చి’ నుండి ‘భరత్ అనే నేను’ వరకు వరుసగా సూపర్ హిట్స్ ఇస్తూ వచ్చాడు దర్శకుడు కొరటాల శివ(Koratala Siva). కోవిడ్ కి ముందు వరకు అపజయమెరుగని దర్శకుడిగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగాడు.

Koratala Siva

అయితే, మెగాస్టార్ చిరంజీవితో తీసిన ‘ఆచార్య’ సినిమాతో ఆయన సక్సెస్ ట్రాక్ తప్పాడు. ఆ తర్వాత వచ్చిన ‘దేవర’ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించినప్పటికీ.. ఆ క్రెడిట్ అంతా టెక్నికల్ టీమ్ కి, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి వెళ్ళిపోయింది తప్ప,కొరటాల డైరెక్షన్ కి పెద్దగా పేరు రాలేదు అనే చెప్పాలి.

ఒకానొక దశలో స్టార్ హీరోలు కొరటాల శివతో సినిమా అంటే.. ‘తర్వాత చూద్దాం’ అనే స్థాయికి ఆయన ఇమేజ్ పడిపోయిందనే చెప్పాలి. ఇలాంటి క్లిష్ట సమయంలో నందమూరి బాలకృష్ణ… కొరటాల శివకు ఛాన్స్ ఇచ్చి ఆడుకున్నాడు అని చెప్పాలి. ఈ సినిమాతో ఎలాగైనా తన మార్క్ చూపించి, స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కొరటాల గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.కొరటాల శివ ట్రాక్ తప్పడానికి ప్రధాన కారణం.. తన స్ట్రెంత్ ని పక్కన పెట్టి, పాన్ ఇండియా ఇమేజ్ పై మోజు పెంచుకోవడమే అని అంతా భావిస్తున్నారు.

నిజానికి సోషల్ మెసేజ్ కి మాస్ ఎలిమెంట్స్ జోడించి సినిమాలు తీసి హిట్లు కొట్టడంలో కొరటాల దిట్ట. కానీ ‘ఆచార్య’ విషయంలో ‘పాదఘట్టం’ అనడం, ‘దేవర’ లో ‘ఎర్రసముద్రం’ అంటూ కథని లాగడంతో లెక్క తప్పింది.అందుకే బాలయ్యతో చేసే సినిమాను ఒక మంచి సోషల్ పాయింట్ కి.. పక్కా మాస్ ఎలిమెంట్స్ ను జోడించి తెరకెక్కించాలని కొరటాల ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందుకోసం తన రైటింగ్ అండ్ డైరెక్షన్ టీంని కూడా మార్చినట్టు తెలుస్తోంది.మరి ఈ సినిమాతోనైనా కొరటాల శివ బ్లాక్ బస్టర్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి!

‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus