ప్రభాస్ తో సినిమా చేయాలనుకుంటున్న కొరటాల శివ

  • May 2, 2018 / 09:54 AM IST

సామాన్యులకు మాత్రమే కాదు.. సెలబ్రిటీలకు సైతం ఇష్టమైన హీరో ప్రభాస్. అతనితో సినిమా చేయాలనేది ఎంతోమంది డైరక్టర్స్ కల. అందుకోసమే సుజీత్ నాలుగేళ్లు ఏ సినిమా చేయకుండా ఎదురుచూసారు. ఇప్పుడు సాహో చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కూడా ప్రభాస్ ని డైరక్ట్ చేయడానికి డైరక్టర్ రాధాకృష్ణ రెడీగా ఉన్నారు. అలాగే కొరటాల శివ కూడా ఎదురుచూస్తున్నట్టు తెలిసింది. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ దర్శకత్వంలో నటించాలని ఎంతోమంది హీరోలు ఆశపడుతున్నారు. భరత్ అనే నేను హిట్ తర్వాత ఆశపడేవారి జాబితా పెరిగింది. అయినా కొరటాల శివ ప్రభాస్ కోసం కథ రెడీ చేస్తున్నట్టు తెలిసింది.

కొరటాలకి ప్రభాస్ తొలి అవకాశం ఇచ్చారు. మిర్చి సూపర్ హిట్ అయింది. తనకి లైఫ్ ఇచ్చిన ప్రభాస్ కి మరో అద్భుతమైన హిట్ ఇవ్వాలని కొరటాల ఆశపడుతున్నట్టు సమాచారం. అయితే ప్రభాస్ రెండు సినిమాలు కంప్లీట్ చేసేసరికి ఏడాది అవుతుంది. అప్పటివరకు కొరటాల ఎదురుచూస్తారా? మధ్యలోనే మరో హీరోతో సినిమా చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఇప్పట్లో ప్రభాస్ డేట్స్ దొరక్కపోతే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కొరటాల సినిమా చేయవచ్చని ఫిలింనగర్ వాసులు చెప్పారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో త్వరలోనే తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus