పవన్ టీవీ షో డైరక్ట్ చేయనున్న క్రిష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుల్లి తెరపైన సత్తా చాటనున్నారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చేసిన ‘సత్యమేయ జయతే” తరహాలో సమాజంలోని సమస్యలపై ప్రశ్నించనున్నారు. పవన్ జనసేన పార్టీ పెట్టినప్పటినుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు మంచి కార్యక్రమం కోసం ఎదురుచూసారు. ఆకట్టుకునే కాన్సెప్ట్ కోసం పరిశీలించారు. ఈటీవీ ఛానల్ వాళ్లు చెప్పిన థీమ్ నచ్చడంతో ఓకే చెప్పారు. రామోజీ రావు నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ కార్యక్రమాన్ని డైరక్ట్ చేసే వారి కోసం కొన్ని పేర్లు పరిశీలించారు.

సమాజంలోని సున్నితమైన అంశాలను చక్కగా తెరకెక్కించి జాతీయ అవార్డు అందుకున్న క్రిష్ కే ఈ అవకాశం వరించింది. అతను ప్రస్తుతం నటసింహ బాలకృష్ణ వందవ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి పనులు పూర్తి అయినా వెంటనే క్రిష్ పవన్ షోలో నిమగ్నం కానున్నట్లు సమాచారం. పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత తమిళ్ వీరం సినిమాను రీమేక్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. డాలీ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ మూవీని తొందరగా పూర్తి చేసి టీవీ షో లో పాల్గొనేందుకు  పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. స్టార్, దూరదర్శన్, ఈటీవీ లలో ప్రసారమైన “సత్యమేయ జయతే” టాక్ షో  ఎన్నో ప్రశంసలు అందుకుంది. దేశవ్యాప్తంగా మంచి చైతన్యాన్ని రగిలించింది. అలాగే పవన్ షో కూడా తప్పకుండా ట్రెండ్ సృష్టిస్తుందని అభిమానులు ధీమాగా చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus