‘అభినందన’ మందార మాల!!!

టాలీవుడ్ లో దర్శకుడిగా నిలబడాలంటే…అయితే బ్యాక్ గ్రౌండ్ ఉండాలి..లేదా పక్కా టాలెంట్ ఉండాలి. ఎందరో దర్శకులు టాలీవుడ్ లో అడుగు పెట్టి ఏదో సాధించెయ్యాలి అన్న ఆతురతతో చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. అయితే కొందరు మాత్రం తమ టాలెంట్ తో టాప్ దర్శకులుగా మారిపోతున్నారు, రాజమౌళి లాంటి టాలెంట్ ఉన్న దర్శకుల తరువాత, క్రిష్ జాగర్లమూడి సైతం అదే కోవలోకి వస్తారు. గమ్యం సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఈ దర్శకుడు హిట్స్ ఫ్లాప్స్ తో సంభంధంలేకుండా సరికొత్త కళాత్మక చిత్రాలను తీస్తూ ముందుకు పోతున్నారు…

ఇదే క్రమంలో గత సంవత్సరం ఈ దర్శకుడు మెగా శిబిరం నుంచి వచ్చిన వరుణ్ తేజ్ తో తీసిన ‘కంచె’ సూపర్ డూపర్ హిట్ కావడం, ఆ చిత్రానికి భారత దేశ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు గెలుచుకోవడం సంతోషకరమైన విషయం. ఇక ఈ హిట్ తో మరింత క్రేజ్ సంపాదించుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణ కాంబినేషన్ లో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ అనే  ఓ చారిత్రాత్మక చిత్రం రూపొందించబోతున్నారు..

ఇక ఈ సినిమా విషయం పక్కన పెడితే…‘కంచె’ చిత్రానికి గాను ఇటీవల జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డు తాలూకు నగదును బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రికి విరాళంగా బాలయ్యకు అందజేశారు. దానికి కారణం సైతం ఆయన తెలుపుతూ…నా తల్లిని రక్షించిన ఆ హాస్పిటల్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని తెలిపారు. ఇక ఈ సంధర్భంలో బాలయ్య మాట్లాడుతూ…మంచి పనులు చేయాలంటే మంచి మనసు ఉండాలని గొప్ప స్థాయికి చేరుకున్నా కూడా మంచితనం పరిమిళించిన వ్యక్తి క్రిష్ అని పొగడ్తలలో ముంచెత్తారు.. ఏది ఏమైనా..శభాష్ “క్రిష్”

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus