ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కానీ క్రిష్

బయోపిక్ అంటే ఒక డాక్యుమెంటరీల ఉంటుందనే కాలం పోయింది. కమర్షియల్ సినిమాలకు తగ్గకుండా కలక్షన్స్ రాబడుతుందని సావిత్రి బయోపిక్ మహానటి సినిమా నిరూపించింది. అందుకే క్రిష్ ఎక్కడా తగ్గడం లేదు. తన తండ్రి బయోపిక్ అద్భుతంగా రావాలని బాలకృష్ణ నిర్మాతగా ఖర్చుకి అసలు వెనుకాడడం లేదు. ఆర్టిస్టుల సెలక్షన్స్ నుంచి సెట్స్ వరకు అంతా భారీగానే చేస్తున్నారు. నందమూరి తారకరామారావు జీవితాన్ని ఆవిష్కరించే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో కైకాల సత్యనారాయణ, బాలీవుడ్ నటి విద్యాబాలన్(బసవతారకం), రానా (చంద్రబాబునాయుడు), సుమంత్ (అక్కినేని నాగేశ్వరరావు) వంటి స్టార్ హీరో, హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా ఈ సినిమా ద్వారా వెండితెర ప్రవేశం చేస్తున్నారు.

చిన్నప్పటి బాలకృష్ణగా కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా గురించి బయటికి వచ్చిన ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ పనిచేస్తున్నారంటా. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మాత్రమే కాదు. మేకప్ వేయడానికి విదేశీ నిపుణులను క్రిష్ రప్పించినట్టు తెలిసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో బాలయ్య అచుగుద్దినట్టు ఎన్టీఆర్ లా కనిపించారు. అందరితో అభినందనలు అందుకున్న ఈ లుక్ వెనుక హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టుల పనితనమే దాగుందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఇప్పుడు ఆ ఆర్టిస్టులు రానాని చంద్రబాబు నాయుడిలా రెడీ చేస్తున్నారంటా. ఆ లుక్ కూడా మరో వారంలో బయటికి రానుంది. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus