స్టార్ ప్రొడ్యూసర్ ఇంట్లో విషాదం.. చిన్న వయసులోనే..!

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప ఎంత మాత్రం తగ్గడం లేదు. నిత్యం ఎవరో ఒక సినీ సెలబ్రిటీ కన్నుమూస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాది ఇప్పటికే నిర్మాత ఎస్.కె.ఎన్ (Sreenivasa Kumar Naidu) తండ్రి, నటుడు వేణు (Venu Thottempudi) తండ్రి, దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) తండ్రి, దర్శకుడు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్  (Surya Kiran) , ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్ర నాథ్, సీరియల్ నటి పవిత్ర జయరాం, మరో సీరియల్ నటుడు చందు, దర్శకుడు సూర్య ప్రకాష్, రైటర్ శ్రీ రామకృష్ణ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీర భద్రరావు, విలన్ రోల్స్ చేసే డేనియల్ బాలాజీ (Daniel Balaji) , హీరోయిన్ అమృత పాండే, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, సింగర్ సింగ్ ఉమా రామనన్,నటి స్మృతి బిశ్వాస్ వంటి వారు మరణించారు.

Krishan Kumar

ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన టి-సిరీస్ అధినేత క్రిషన్ కుమార్ () ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె తిశా మృతి చెందారు. ఆమె వయసు 20 ఏళ్లు మాత్రమే కావడం విషాదకరం. చాలా కాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ వస్తున్న ఆమె.. జెర్మనీలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించినట్టు టి.సిరీస్ ప్రతినిధి వెల్లడించారు.

గతేడాది ‘యానిమల్’ (Animal) సినిమా టైంలో ఆమె బాహ్యప్రపంచానికి దూరమయ్యారు. ఎక్కడా కూడా బయట కనబడలేదు. తిశా మరణవార్త బాలీవుడ్ ని కుదిపేసింది అని చెప్పాలి. చిన్నవయసులోనే క్యాన్సర్ మహమ్మారి ఆమెను బలితీసుకోవడం చాలా ఘోరమని అక్కడి సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఎంత డబ్బు ఉన్నా.. కూతుర్ని కాపాడుకోలేని పరిస్థితిల్లో ఉన్న క్రిషన్ కుమార్ పై అందరూ జాలి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus