తెలుగు సినిమా చరిత్రలో జానపద చిత్రాలన్నా, సెట్స్ అన్నా, స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నా ముందుగా గుర్తొచ్చే పేరు అలనాటి విఠలాచార్య. సాంకేతికత అనే పదమే మనం వినని రోజుల్లో… స్పెషల్ ఎఫెక్స్ట్‌తో ఓ ఆటాడుకున్న దర్శకుడు ఆయన. ఆయన గొప్పతనం అంతటితో ఆపేసేది కాదు. జానపద చిత్రాల్లోనూ తనదైన మార్కు వేశారు విఠలాచార్య. అందుకే ఇప్పటికే ఈ జోనర్ పేరు వినిపించగానే ‘నువ్వేమైనా విఠలాచార్య అనుకుంటున్నావా?’ అని అంటుంటారు. జానపద బ్రహ్మగా తెలుగు సినిమాలో సువర్ణాధ్యాయాన్ని సృష్టించుకున్న ఘన విఠలాచార్య సొంతం.
ఆయన సినీ జీవిత ప్రయాణాన్ని ‘జై విఠలాచార్య’ పేరుతో పుస్తక రూపంలోకి తీసుకొస్తున్నారు రచయిత, సీనియర్ జర్నలిస్ట్ అయిన పులగం చిన్నారాయణ. ఈ పుస్తకం ఫస్ట్‌లుక్‌ను నటుడు సూపర్‌స్టార్ కృష్ణ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఠలాచార్యతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కృష్ణ. విఠలాచార్య దర్శకత్వంలో నేను ‘ఇద్దరు మొనగాళ్లు’ సినిమా ఒకటే చేశా. అప్పట్లో అనుకున్న బడ్జెట్‌లో వేగంగా సినిమాలు తీసేవారు. సినిమా కోసం దర్బార్ సెట్ వేస్తే..
అందులో ఒకవైపు బెడ్‌రూమ్, ఇంకోవైపు కారిడార్ సెట్స్ వేసేవారు. అలా పక్కా ప్లానింగ్‌తో సినిమాలు చేసేవారు అంటూ కృష్ణ నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. విఠలాచార్య శత జయంతి సందర్భంగా ఈ పుస్తకానికి అంకురార్పణ చేశాం. సినిమా నిర్మాణంలో విఠలాచార్య పెద్ద బాలశిక్ష లాంటి వారు అన్నారు పులగం చిన్నారాయణ.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!