‘కృష్ణ ఘట్టం’ చిత్రం నుంచి కృష్ణుని పద్యం విడుదల

వైల్డ్ వర్ట్యూ క్రియేషన్స్ పతాకం పై చైతన్య కృష్ణ, మాయ నెల్లూరి, సాష సింగ్, దువ్వాసి మోహన్, వినయ్ నల్లకడి మరియు డాక్టర్ వెంకట గోవాడ ముఖ్య తారాగణం తో సురేష్ పళ్ళ స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కృష్ణ ఘట్టం’. ఈ చిత్రానికి మూడి క్రాబ్ ఫిలిం ఫెస్టివల్ (Moody Crab Film Festival) వారు 2022 లో బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు (Best Feature Film Award) తో సత్కరించారు. అలాగే ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను మాస్ హీరో విశ్వక్ సేన్ విడుదల చేసి ట్రైలర్ చాలా బాగుంది అని ప్రశంసించారు.

అయితే ఈ రోజు  చిత్రం లోని కృష్ణుడి పద్యాన్ని విడుదల చేశారు చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత సురేష్ పల్లా మాట్లాడుతూ “కృష్ణాష్టమి పండుగ సందర్భంగా మా ‘కృష్ణ ఘట్టం’ చిత్రం నుంచి కృష్ణుడి పద్యాన్ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. సర్వలోక రక్షకుడు అయిన కృష్ణుడిని ఎవరు ఎప్పుడు ఎలా పిలువగలరు అని ఓ భక్తుడు అడిగిన ప్రశ్న కి శ్రీ కృష్ణుడు ఇచ్చిన సమాధానమే ఈ పద్యం. ఈ అచ్చ తెలుగు పద్యం కృష్ణుడి భక్తులకు పండగలా ఉంటుంది. ఒక దశాబ్ద కాలం లో ఇలాంటి తెలుగు పద్య నాటకం మన తెలుగు చిత్రంలో ఎన్నడూ రాలేదు. ఈ పద్యం కృష్ణాష్టమి పండుగ రోజు కృష్ణుడికి నైవేద్యం లాంటిది. మా ఈ పద్యాన్ని 30 సంవత్సరాలుగా కృష్ణుడి వేషం వేస్తూ తెలుగు పద్యనాటకాలు చేస్తున్న గుమ్మడి గోపాలకృష్ణ గారు విడుదల చేశారు. అయన మా చిత్ర ట్రైలర్ మరియు పద్యానటకం చూసి చాలా బాగుంది అని మెచ్చుకున్నారు.  మా చిత్రాని త్వరలోనే విడుదల చేస్తాం” అని తెలిపారు

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus