మహేష్, కొరటాల శివ సినిమాలో నటించనున్న కృష్ణ
- August 11, 2017 / 09:34 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ మూవీ కోసం డబ్బింగ్ చెబుతూనే.. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న “భరత్ అనే నేను” మూవీ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. నగర శివార్లలో వేసిన అసెంబ్లీ సెట్ లో కొన్ని సీన్స్ తెరకెక్కించారు. ఇప్పుడు చిత్ర బృందం తదుపరి షెడ్యూల్ ని లఖ్నో లో ప్లాన్ చేసింది. లఖ్నో లో ప్రాచుర్యం పొందిన జహంగీరాబాద్ ప్యాలెస్, నడ్వా కళాశాల, ముసాబాఘ్ ప్యాలెస్ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. త్వరలో చిత్రబృందం లఖ్నో వెళ్లనుంది. అయితే ఈ మూవీ గురించి ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ నటించనున్నట్లు తెలిసింది.
ఓ కీలక రోల్లో అతను కనిపిస్తారని సమాచారం. రాజకుమారుడు, టక్కరి దొంగ సినిమాల్లో తండ్రి కొడుకులు నటించారు. ఇప్పుడు ఈ మూవీలో కలిసి నటించనున్నారు. రాజకీయ నేపథ్య కథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి బరిలోకి దిగనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















