ఈ మధ్యకాలంలో ఆడియో రైట్స్ రోజుకో రీతిన మారుతుంటాయి. తక్కువ రేట్లకే ఆడియో రైట్స్ ను చేజిక్కించుకొని.. ఆ పాటలు హిట్టయితే బీభత్సంగా డబ్బు చేసుకునే పనిలో పడ్డాయి ఆడియో కంపెనీలు. ఓ సినిమాను కంపెనీకి అమ్మేసిన తరువాత బోలెడన్ని కండీషన్స్ కు, గందరగోళానికి తలొగ్గాల్సి ఉంటుంది. అవన్నీ భరించలేకే.. సొంత ఆడియో కంపెనీల వైపు నిర్మాతలు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా కృష్ణవంశీ ‘SILK’ అనే పేరుతో ఆడియో కంపెనీను మొదలుపెట్టారు.
‘రంగమార్తాండ’ సినిమా పాటలు ఈ కంపెనీ నుంచే విడుదలవుతాయి. ‘SILK’కి ఫుల్ ఫామ్ కూడా ఉంది. ఇందులో ‘S’ అంటే సీతారామశాస్త్రి, ‘IL’ అంటే ఇళయరాజా, ‘K’ అంటే కృష్ణవంశీ. కృష్ణవంశీకి సీతారామశాస్త్రి అంటే చాలా ఇష్టం. ఒకరకంగా చెప్పాలంటే సీతారామశాస్త్రికి కృష్ణవంశీ దత్తపుత్రుడు. మరోవైపు ఇళయరాజాకి వీరాభిమాని. అలా తనకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తుల పేర్లతో తన పేరుని జత చేస్తూ ఓ పేరుని సృష్టించి.. తన కొత్త కంపెనీకి అదే పేరు పెట్టారు.
ఇక ఆయన సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే ‘రంగమార్తాండ’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై ప్రేక్షకుల్లో మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా తరువాత ‘అన్నం’ అనే మరో సినిమా చేయబోతున్నారు కృష్ణవంశీ. అలానే ఓ భారీ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు చెప్పారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు కృష్ణవంశీ. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!