Krishna Vamsi, Chiranjeevi: కృష్ణవంశీ కోరిక నెరవేరుతుందా..?

Advertisement

దర్శకుడు కృష్ణవంశీ తన కెరీర్ లో ఎన్నో హిట్టు సినిమాలను తెరకెక్కించారు. ‘గులాబీ’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘అంతఃపురం’, ‘ఖడ్గం’ ఇలాంటి సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నేషనల్ లెవెల్ లో అవార్డులను అందుకోవడంతో పాటు నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్న ఈ దర్శకుడు కొన్నిరోజులుగా హిట్టు రాక ఇబ్బందిపడుతున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘నక్షత్రం’ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో ‘రంగమార్తాండ’ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాగార్జున తన ఫేవరెట్ హీరో అని చెప్పిన కృష్ణవంశీ.. మెగాస్టార్ చిరంజీవితో ఎప్పటికైనా సినిమా చేయాలని తన కోరికను బయటపెట్టారు. గతంలో చిరంజీవి హీరోగా రెండు, మూడు సినిమాలనుకుంటే.. ఒక్కటి కూడా కుదరలేదని చెప్పారు. ఆయనతో ఎప్పటికైనా ఒక్క సినిమా అయినా చేయాలని అన్నారు. ఇక ‘రంగమార్తాండ’ సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ ఇంకా పదిరోజులు మిగిలే ఉందని..

ఈ సినిమాలో కొత్త బ్రహ్మానందాన్ని చూస్తారని అన్నారు. అలానే రమ్యకృష్ణలో కొత్త కోణాన్ని చూస్తారని చెప్పారు.’రంగ‌మార్తాండ’ థియేట‌ర్‌లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అని.. మ‌రి ఇది ఓటీటీలోకి వ‌స్తుందా..? థియేట‌ర్‌లో రిలీజ్ అవుతుందా..? అన్నది ఇప్పుడే చెప్ప‌లేమని అన్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus