టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సల్మాన్ ఖాన్ తరువాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సల్మాన్ అసలు పెళ్లి చేసుకుంటాడా లేదా అనే విషయం గత కొన్నేళ్లుగా అభిమానుల్లో ఎన్నో రకాల అనుమానాలను క్రియేట్ చేస్తోంది. ఇక ఇంట్లో వాళ్ళు అయితే పెళ్లి చేసుకోమ్మని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అయినా కూడా డార్లింగ్ వాయిదాల మీద వాయిదాలు వేసేస్తున్నాడు.
ఇక చాలా కాలం తరువాత ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మళ్ళీ ఆ విషయంపై ఒక కౌంటర్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నోసార్లు ప్రభాస్ ను పెళ్లి చేసుకోమ్మని ఆడిగినప్పటికీ అతనే వాయిదా వేస్తున్నట్లు కృష్ణంరాజూ చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇక రీసెంట్ గా 80వ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కృష్ణంరాజు ఒక్క మాటతో మళ్ళీ ఆ ప్రశ్న వేయకుండా చేసేశారు.
ప్రభాస్ పెళ్లి అయినప్పుడు చూద్దాం. నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ కౌంటర్ ఇవ్వడంతో అక్కడికే మ్యాటర్ ను క్లోజ్ చేసేశారు. అంటే ప్రభాస్ సొంత నిర్ణయం వల్లే పెళ్లి వాయిదా వేసుకుంటున్నట్లు మరోసారి చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. ఇక కుటుంబ సభ్యులు మాత్రం ప్రభాస్ పెళ్లి చేయాలని చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రభాస్ రాజగారు పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో చూడాలి.
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!