Shyamala Devi: పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన శ్యామలాదేవి!

  • January 22, 2024 / 12:21 PM IST

సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రేటీలో రాజకీయాలలోకి వస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు రాజకీయాలలో కొనసాగుతూ ఉండగా మరి కొంతమంది కేంద్ర మంత్రులుగా ఎంపీలుగాను ఎమ్మెల్యేలుగాను కూడా పనిచేశారు. ఈ క్రమంలోనే సినీ నటుడు దివంగత కృష్ణంరాజు కూడా రాజకీయాలలో కొనసాగిన సంగతి తెలిసిందే. ఈయన కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇక నరస్సాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

ఇలా బిజెపి పార్టీలో కొనసాగారు అనంతరం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చారు. అయితే ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేక తిరిగి బిజెపికి వెళ్లిపోయారు. కృష్ణంరాజు రాజకీయాల పరంగా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఇటీవల కృష్ణం రాజు గారి జయంతి సందర్భంగా మొగల్తూరులో హెల్త్ క్యాంప్ నిర్వహించిన సంగతి తెలిసిందే. నిరుపేదలందరికీ కూడా వైద్యం అందించారు.

ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు సతీమని ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి పాల్గొని హెల్త్ క్యాంప్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్యామల దేవి మాట్లాడుతూ కృష్ణంరాజు గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే తన ముందున్నటువంటి ఏకైక లక్ష్యమని తెలిపారు. ఆయన ఎప్పుడు కూడా పేదవారికి విద్య వైద్యం అందేలా చూడాలని భావించారు. అందుకే ఆయన జయంతి సందర్భంగా హెల్త్ క్యాంప్ నిర్వహించామని తెలిపారు.

ఇక రాజకీయాల గురించి వస్తున్నటువంటి వార్తలపై కూడా ఈ సందర్భంగా (Shyamala Devi) ఈమె స్పందించారు. ప్రస్తుతం తన హెల్త్ క్యాంప్ సక్సెస్ ఫుల్ గా పూర్తి కావాలని అనంతరం రాజకీయాల గురించి మాట్లాడతానని ఈమె తెలిపారు. అయితే రాజకీయాల్లోకి వస్తారనే వార్తలను ఖండించకుండా తర్వాత మాట్లాడతాను అని చెప్పడంతో ఈమె తప్పకుండా రాజకీయాలలోకి రాబోతుందని వైయస్సార్సీపీ పార్టీ నుంచి నరసాపురం లోక్ సభ స్థానంలో పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus