Krithi Shetty: కృతిశెట్టికి గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో.. కానీ?

తెలుగులో చిన్న వయస్సులోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లలో కృతిశెట్టి ఒకరు. కృతిశెట్టి నటించిన బంగార్రాజు 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుండగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం, రామ్ లింగుస్వామి కాంబో సినిమాలలో కృతిశెట్టి నటిస్తున్నారు. కొత్త కథలు వింటున్న కృతిశెట్టి త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్టుల గురించి ప్రకటనలు చేసే అవకాశాలు ఉన్నాయి. బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతిశెట్టి దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో కలిసి అలీతో సరదాగా షోకు హాజరయ్యారు.

అలీ కృతిశెట్టిని బుంగి అనే ముద్దుపేరుతో పిలవగా కృతి మీకెలా తెలుసు అని క్యూట్ గా అలీని అడిగారు. ఆ తర్వాత అలీ ఇంకొక ముద్దుపేరు కూడా కృతికి ఉందని చెప్పాడు. కళ్యాణ్ కృష్ణ కృతిశెట్టికి చాలా పేర్లు ఉన్నాయని నేను కేకే అని పిలుస్తానని చెప్పగా ఆయన కళ్యాణ్ కృష్ణ నేను కృతి కృష్ణ అని ఆమె చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి రాకముందు 25 యాడ్స్ లో నటించానని కృతి చెప్పుకొచ్చారు. ఎక్కువగా బిస్కెట్స్ యాడ్స్ లో తాను నటించానని ఆమె అన్నారు.

ఎవరికైనా బిస్కెట్ వేశారా అని అలీ అడగగా వేయలేదని కృతి బదులిచ్చారు. వేరేవాళ్లు మీకు బిస్కెట్ వేశారా? అని అడిగితే కృతి విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. ఉప్పెన హిట్టైన తర్వాత యూ ఆర్ ఏ బోర్న్ స్టార్ అని స్టార్ హీరో బొకేతో పాటు గిఫ్ట్ పంపించారని కృతి తెలిపారు. ఆ స్టార్ హీరో పక్కన ఛాన్స్ వస్తే చేస్తావా? అనే ప్రశ్నకు కృతి తటాపటాయించారు. అయితే ఆ స్టార్ హీరో ఎవరనే విషయం ప్రోమోలో రివీల్ కాలేదు.

బ్రహ్మానందం అంటే చాలా ఇష్టమని చెబుతూ బ్రహ్మానందం ఏ విధంగా ఎక్స్ ప్రెషన్ ఇస్తారో కృతిశెట్టి అలా ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. ఈ నెల 17వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ప్రోమోకు 7 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!


ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus