Krithi Shetty, Mahesh Babu: మహేష్ బాబు పై ప్రశంసలు కురిపించిన కృతి శెట్టి.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు కన్నడ బ్యూటీ కృతి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈమె వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వెంట వెంటనే మూడు హిట్ సినిమాలలో నటించిన కృతి శెట్టి వరుస ఫ్లాప్ సినిమాలు కూడా వెంటాడుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈమె నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా కృతి శెట్టికి నిరాశను కలిగించింది.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కృతి శెట్టి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశారు. ఆస్క్ కృతి పేరిట ఈమె సెషన్ నిర్వహించారు.సందర్భంగా ఎంతో మంది నెటిజన్లు ఎన్నో ప్రశ్నలు అడిగినప్పటికీ ఈమె ఓపిక వాటికి సమాధానం చెబుతూ వచ్చారు. మహేష్ బాబు గురించి చెప్పమని అడిగారు. ఇలా మహేష్ బాబు గురించి కృతి శెట్టికి ప్రశ్న ఎదురవడంతో ఈమె సమాధానం చెబుతూ..

మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అంటూ ఒక్కమాటలో మహేష్ బాబు గురించి ఒక్కమాటలో ఈమె ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ఇలా మహేష్ బాబు గురించి ఈమె చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరొక నేటిజన్ కోలీవుడ్ స్టార్ విజయ్ గురించి చెప్పమని అడగగా ఆమె తన గురించి మాట్లాడుతూ ఇన్స్పైరింగ్ సూపర్ స్టార్ అంటూ తన గురించి తెలియజేశారు.

మొత్తానికి ఈ చిట్ చాట్ ద్వారా కృతి శెట్టి ఎన్నో విషయాలను అభిమానులతో ముచ్చటించారు. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య సరసన మరోసారి వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు తమిళ భాషలలో ఓ సినిమా చేయనున్నారు. అదేవిధంగా బాల దర్శకత్వంలో హీరో సూర్య సరసన కూడా నటించనున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus