kriti Sanon: అదే నాకు ప్లస్ అయింది.. కృతిసనన్ కామెంట్స్ వైరల్!

మరో 96 గంటల్లో ఆదిపురుష్ మూవీ థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. ఆదిపురుష్ మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. టికెట్ రేట్లకు సంబంధించి తుది నిర్ణయం వెలువడిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ మొదలుకానున్నాయని సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమాలో సీత రోల్ కు ఎంపిక చేయడం గురించి కృతిసనన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆదిపురుష్ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం అని ఆమె చెప్పుకొచ్చారు. నా హైట్ ఎక్కువగా ఉండటం వల్ల గతంలో కొన్ని సినిమాలలో ఆఫర్లు వచ్చినట్టే వచ్చి పోయాయని కృతిసనన్ తెలిపారు. అయితే ఆదిపురుష్ మూవీ విషయంలో మాత్రం భిన్నంగా జరిగిందని ఈ సినిమాకు సంబంధించి హైట్ నాకు ప్లస్ అయిందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రభాస్ మంచి ఎత్తు ఉన్న హీరో కావడంతో ఆయనకు జోడీగా నన్ను సంప్రదించారని కృతి వెల్లడించారు.

ఆ విధంగా సీత రోల్ కు నన్ను ఎంపిక చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. కృతిసనన్ వెల్లడించిన విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కృతి త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. కృతిసనన్ ఆదిపురుష్ సినిమాకు భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకున్నారని సమాచారం అందుతోంది. కృతిసనన్ కు సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతోంది.

కృతిసనన్ కెరీర్ పరంగా మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కృతిసనన్ కు తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. కథల ఎంపికలో, పాత్రల ఎంపికలో ఈ బ్యూటీ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కృతిసనన్ కెరీర్ పరంగా మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకొని తన రేంజ్ పెంచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాస్, కృతి కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus