Krithi Shetty: కృతి ఉమన్‌ ఓరియెంటెడ్‌ సినిమా చేస్తుందా..!

Ad not loaded.

‘ఉప్పెన’ సినిమాతో బేబమ్మగా టాలీవుడ్‌కి పరిచయమైంది కృతి శెట్టి. అప్పటికే ‘సూపర్‌ 30’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన కృతి… ‘ఉప్పెన’తో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయింది. ఇప్పుడు తెలుగులో యువ కథానాయకులకు బెస్ట్‌ ఆప్షన్‌గా మారింది. తమిళంలోనూ ఓ సినిమాలో నటిస్తోంది. మరి నెక్స్ట్‌ స్టాప్‌ బాలీవుడ్డేనా? ఈ ప్రశ్నను ఆమె దగ్గరకు తీసుకెళ్తే ఆసక్తికరమైన సమాధానమిచ్చింది.

‘ఉప్పెన’ తర్వాత కృతి శెట్టి వరుసగా కొత్త సినిమాలకు సంతకం చేసేసింది. అలా నటించిన వాటిలో ‘శ్యామ్‌ సింగ రాయ్‌’, ‘బంగార్రాజు’, ‘వారియర్‌’ ఇప్పటికే వచ్చాయి. నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కాకుండా తెలుగులో రెండు సినిమాలున్నాయి, తమిళంలో సూర్య సరసన నటిస్తోంది. దీంతో కృతి నెక్స్ట్‌ స్టాప్‌ బాలీవుడ్‌ అవ్వొచ్చు అనే అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆమె ఓ బాలీవుడ్‌ సినిమాలో నటించింది. అయితే అది కథానాయిక పాత్ర కాదు. ఈ లెక్కన ఆమె బాలీవుడ్‌కి వెళ్లడం పెద్ద విషయం కాదు అనే మాటలు వినిపించాయి.

ఇదే మాట కృతి దగ్గర ప్రస్తావిస్తే.. “ప్రస్తుతం బాలీవుడ్‌కి వెళ్లే ప్లాన్ లేదు. బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చిన మాట అయితే నిజం. కానీ ప్రస్తుతం వెళ్లాలని అనుకోవడం లేదు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇక్కడ సినిమాలు చేయడమే నాకు ఇష్టం, ఆనందం” అని చెప్పింది కృతి శెట్టి. దీంతో ఇప్పటికిప్పుడు కృతి బాలీవుడ్‌ వెళ్లే అవకాశం లేదు అని చెప్పొచ్చు. అయితే ఆ తర్వాత వెళ్తుందా అంటే ఏమో చెప్పలేం అనొచ్చు.

కృతి రాబోయే సినిమాల లిస్ట్‌ చూస్తే సుధీర్‌బాబుతో ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా చేసింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నా.. ఇంకా డేట్‌ అనౌన్స్‌ కాలేదు. గతంలో ఓసారి ప్రచారం షురూ చేసినా ఆగిపోయింది. ఇది కాకుండా నాగచైతన్య – వెంకట్‌ ప్రభు సినిమాలో కృతిని తీసుకున్నారు. బాలా దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘అచలుడు’లో నటిస్తోంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus