తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రముఖ నటుడు దగ్గుబాటి రానాకు ఓ సూచన చేశారు. తండ్రితో చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కష్టమేనని కేటీఆర్.. రానాకు సూచించారు.
కేటీఆర్, రానాల మధ్య సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ వేదికగా సంభాషణ జరుపుకున్నారు. రానా తన తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో ఓ సెల్ఫీని దిగారు. దానిని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దాని కింద ట్వీట్ చేశారు.