అమెరికాలోనూ కుర్చీని మడతబెడుతున్న ఫ్యాన్స్‌.. వైరల్‌ వీడియో చూశారా?

కొన్ని సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోవచ్చు.. కానీ అందులోని డైలాగ్‌లో, పాటలో భారీ విజయాన్ని అందుకుంటాయి. మన దగ్గరే కాదు.. విదేశాల్లోనూ కొన్ని తెలుగు పాటలకు స్టెప్పులేస్తుంటారు. ఈ ట్రెండ్‌ ఇప్పటిది కాదు కానీ… ఇప్పుడు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తోంది అని చెప్పొచ్చు. మరోవైపు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మన తెలుగు పాటలను చాలా స్టేడియాల్లో వేస్తున్నారు. ఓవర్‌ బ్రేక్‌లు, కొత్త ప్లేయర్‌ వచ్చినప్పుడు చూస్తుంటాం. ప్రస్తుతం ఇలా ఎక్కువగా వినిపిస్తున్న పాట ‘కుర్చీ మడతపెట్టి…’

త్రివిక్రమ్‌ (Trivikram) – మహేశ్‌ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కి మొన్న సంక్రాంతికి వచ్చిన చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) . ఆ సినిమాలో మహేష్‌ – శ్రీలీల (Sreeleela) మీద ఈ పాటను చిత్రీకరించారు. విడుదలకు ముందు యూట్యూబ్‌, విడుదలయ్యాక థియేటర్లలో ఈ పాట హంగామా అంతా ఇంతా కాదు. కుర్రకారు ఆ పాటకు ఉర్రూతలూగిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ టోర్నీలో ఈ పాట వినిపిస్తోంది కూడా. ఒకట్రెండు రోజుల్లో మన స్టార్‌ క్రికెటర్లలో డీజే టచ్‌ ఉన్నవాళ్లు ఈ పాటకు చిన్నపాటి మూమెంట్స్‌ వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు విషయంలో వైరల్‌ అవుతున్న వీడియో. ప్రముఖ దర్శకుడు తమన్‌ (S.S.Thaman) ఓ వీడియోను ట్వీట్ చేశారు దాని ప్రకారం ఆ పాటను అమెరికాలోని ఓ వేదికపై ప్రదర్శించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ మాస్‌ పాటకు చిందేసి ఎంజాయ్‌ చేశారు. అమెరికాలో నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ గేమ్స్‌లోనే ఇది జరిగింది. ‘మన పాట హవా ప్రపంచవ్యాప్తంగా ఇంకా కొనసాగుతోంది’ అని ఆ వీడియో షేర్‌ చేస్తూ సినిమా టీమ్‌ షేర్‌ చేసింది.

ఇక ఈ సినిమా విషయానికొస్తే సంక్రాంతి బజ్‌తో తొలి రోజుల్లో భారీ వసూళ్లే కనిపించాయి. దీంతో బ్లాక్‌బస్టర్‌ పక్కా అని అనుకున్నారు. కానీ ఆ ఊపును సినిమా వీకెండ్‌ తర్వాత ముందుకు తీసుకెళ్లలేకపోయింది. దీంతో నిర్మాతలు ఆశించిన ఆ భారీ విజయం దక్కలేదు. సంక్రాంతికి ఆ సినిమా రాకపోతే ఎలా ఉండేదో అనే డౌట్‌ కూడా రేగింది.

https://twitter.com/i/status/1774761337521942881

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus