‘సరిలేరు నీకెవ్వరు’.. మహేష్ కు మరో ‘ఒక్కడు’ అవుతుందా?

మహేష్ బాబుకి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రం ‘ఒక్కడు’. గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎం.ఎస్.రాజు నిర్మించాడు. 2003 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మహేష్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అప్పటి వరకూ రక రకాల ప్రయోగాలు చేస్తూ.. చాలా ప్లాపులను మూటకట్టుకున్నాడు మహేష్. ఉదయ్ కిరణ్, తరుణ్ వంటి హీరోలు ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా మహేష్ ను మించిన క్రేజ్ తో దూసుకుపోతున్న తరుణంలో ‘ఒక్కడు’ చిత్రం ఆయనకు ఊపిరి పోసింది. ఆ చిత్రంలో మహేష్ నటన గురించి ఎంత మాట్లాడుకున్నారో ‘చార్మినార్’ సెట్ గురించి కూడా అంతే రేంజ్లో మాట్లాడుకున్నారు. అలాగే కర్నూల్ కొండా రెడ్డి బురుజు సెంటర్లో మహేష్ బాబు ప్రకాష్ రాజ్ పై వచ్చే సీన్లు హైలెట్ గా నిలిచాయి.

ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కొండారెడ్డి బురుజు సెట్ ను వేస్తున్నారట. మహేష్ ఎలాగూ కర్నూల్ లోనే ఉన్నారు. అక్కడ కొన్ని షాట్లు తీస్తున్నారట. అయితే ఆ చుట్టూ పక్కన ఉండే వీధుల్లో కూడా కొన్ని తీయాల్సిన షాట్లు అక్కడ కుదరట్లేదంట. అందుకే రామోజీ ఫిలింసిటీలో సెట్లు వేస్తున్నారని సమాచారం. అంతేకాదు అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా ఓ ట్రైన్ సెట్ వేయిస్తున్నాడంట దర్శకుడు అనిల్ రావిపూడి. అక్కడ కొన్ని యాక్షన్ సీన్లతో పాటు.. విజయశాంతి, మహేష్ కు మధ్య ఉండే సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తారట. చూస్తుంటే అనిల్ రావిపూడి కూడా ‘ఒక్కడు’ డైరెక్టర్ గుణశేఖర్ లానే సెట్లు మీద సెట్లు వేయిస్తున్నాడు. మరి 2020 సంక్రాంతికి ‘ఒక్కడు’ లాంటి హిట్టు మహేష్ కు ఇస్తాడా..? అనేది చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus