తెలుగు, తమిళం, మలయాళం మాత్రమే కాకుండా హిందీ భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి కుష్బూ. హీరోయిన్ గా అనేక విజయాలు అందుకున్న ఈమె క్యారక్టర్ ఆర్టిస్టుగానూ అభినందనలు అందుకుంటున్నారు. స్టాలిన్ సినిమాలో చిరంజీవికి అక్కగా నటించిన కుష్బూ.. రీసెంట్ గా అజ్ఞాతవాసిలోనూ పవన్ కళ్యాణ్ కి పిన్నిగా నటించి మెప్పించారు. వెండితెర, బుల్లితెరపై పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియా వేదికపై అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పారు. తెలుగు హీరోల గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడగగా.. అందుకు ఆమె స్పందిస్తూ..
”చిరంజీవి లెజెండ్, బంగారం లాంటి మనసున్న వ్యక్తి. విక్టరీ వెంకటేశ్ మై సెంటిమెంటల్ హీరో. పవన్ కల్యాణ్ మంచి సహ నటుడు. ఆయనతో పని చేయడం చాలా సౌకర్యం. మహేశ్తో పని చేయలేదు. అతని గురించి తెలియదు. కానీ మంచి మనిషి. తారక్ అంటే ఇష్టం.” అని మనసులోని మాటని బయటపెట్టారు. మరి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించారు.. కదా.. అతని గురించి చెప్పమని కోరగా.. వీలుంటే అతని దర్శకత్వంలో మరో మూవీ చేయాలనీ ఉందని వెల్లడించారు. అలాగే తమిళ హీరోల గురించి మాట్లాడుతూ ”రజనీకాంత్ వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్. టాలెంటెడ్ స్టార్. కమళ్ హాసన్ మంచి స్నేహితుడు. అతనికి నేను అభిమానిని.” అని ఖుష్బూ వివరించారు.