రిపోర్ట్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్నట్లుంది

ఇప్పుడు అంద‌రి నోట్లో అజ్ఞాత‌వాసి అనే మాట మారుమ్రోగుతోంది. ప‌వ‌న్ 25వ చిత్రంగా తెర‌కెక్కిన ఈ చిత్రం రేపు గ్రాండ్‌గా విడుద‌ల కానుండ‌డంతో అభిమానుల‌తో పాటు సినీ సెల‌బ్రిటీలు కూడా ఈ సినిమా కోసం చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే సాయి ధ‌ర‌మ్ తేజ్‌, నిఖిల్‌, రామ్ చ‌ర‌ణ్ వంటి స్టార్స్ అజ్ఞాత‌వాసి సినిమా కోసం ఎంత‌గానో ఎదురు చూస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు.
ఇక ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన ఖుష్బూ ఈ సినిమా కోసం ఎంత‌గానో ఎద‌రు చూస్తుంద‌నే విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. అజ్ఞాత‌వాసి జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానుంది. చిన్న పిల్ల‌లు త‌న తొలి రిపోర్ట్ కోసం ఎంత‌గా ఎదురు చూస్తారో ఆ భావ‌న నాకు క‌లుగుతుంది. ప‌దేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు తెర‌పై క‌నిపించ‌బోతున్నాను. త్రివిక్రమ్‌పై నాకున్న నమ్మకం వమ్ముకాదు.

థ్యాంక్యూ పవన్‌ కల్యాణ్‌ ఫర్‌ ఎవిరిథింగ్‌’ అంటూ ట్విటర్‌ వేదికగా తన ఉద్వేగాన్ని అభిమానులతో పంచుకున్నారు ఖుష్బూ. “స్టాలిన్” సినిమాలో చిరు అక్క‌గా చివ‌రి సారి క‌నిపించిన ఖుష్బూ మ‌ళ్లీ ప‌వ‌న్ సినిమాతో తెలుగు తెర‌పై క‌నిపించ‌నుండ‌డం విశేషం. అజ్ఞాతవాసి చిత్రంలో ఖుష్బూది చాలా కీల‌క పాత్ర అని, ఈ మూవీతో ఖుష్బూ మ‌ళ్లీ తెలుగు తెర‌పై త‌న హ‌వా చూపనుంద‌ని భావిస్తున్నారు ఆమె అబిమానులు. అను ఇమ్మానుయేల్, కీర్తి సురేష్‌లు ఈ చిత్రంలో పవన్‌తో జోడీ క‌ట్ట‌గా, ఆదిపినిశెట్టి మరో ముఖ్యపాత్రలో నటించాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus