టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య-సమంత విడిపోయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ విడిపోవడంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ విషయంలో కొంతమంది సమంతని తప్పుపడుతుంటే.. మరికొందరు చైతన్యే తప్పు చేసి ఉంటాడని వాళ్లకు నచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలపై నటి ఖుష్బూ మండిపడ్డారు. ఒక జంట మధ్య ఏం జరిగినా.. ఆదివాళ్ల వ్యక్తిగతమని.. ఎందుకు విడిపోతున్నారనేది వాళ్లిద్దరికీ తప్ప ఎవరికీ తెలియదని అన్నారు.
వాళ్ల గోప్యతను మనం గౌరవించాలని.. వాళ్ల కథకు ముగింపు ఇవ్వడం కోసం దయచేసి మీకిష్టం వచ్చినట్లు ఊహించుకోకండి అని ఖుష్బూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన ఓ నెటిజన్ ”హీరోయిన్లకు ఇలా జరగాల్సిందే.. ఎందుకంటే డబ్బు, స్టార్ హోదా లేకుండా సాధారణ గృహిణిలా వాళ్లు బ్రతకలేరు. ఒక సాధారణ యువకుడిని వాళ్లు ఎందుకు పెళ్లి చేసుకోరు.. జీవితం కంటే డబ్బు, పరపతి ముఖ్యమా..?’ అని ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహానికి లోనైన ఖుష్బూ సదరు నెటిజన్ పై మండిపడ్డారు.
నటీమణులకు ఇలానే కావాలంటూ నువ్ చేసి వ్యాఖ్యల్లోనే అర్ధమవుతోంది నీ మానసిక పరిస్థితి అంటూ ఘాటుగా స్పందించింది. నటీమణుల గురించి నీకేం తెలుసని ప్రశ్నించింది. వాళ్ల జీవితాల గురించి కామెంట్ చేసే అర్హత నీకు ఎక్కడిది..? పబ్లిక్ ఫిగర్ అంటే పబ్లిక్ ప్రాపర్టీ కాదు.. అంటూ ఫైర్ అయింది.