వ్యక్తి కాలర్ పట్టుకుని ప్రశ్నించిన సీనియర్ నటి

  • December 1, 2016 / 12:51 PM IST

టీవీ పరిశ్రమకు భార్యాభర్తల గొడవలు నేడు టీఆర్పీ తెచ్చే అంశంగా మారింది. నాలుగు గోడల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య మాటల యుద్ధాన్ని కొన్ని ఛానల్స్ పక్కా కమర్షియల్ చేశాయి. పెద్దమనుషులుగా వ్యవహరిస్తామని కూర్చున్న అలనాటి హీరోయిన్లు కెమెరాల ముందు ఉన్నామనే సంగతిని మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మన భాష కాదు, పర భాషాకాదు.. ఏ చోట చూసిన ఏమున్నది గర్వకారణం తీర్పు పేరుతో తిట్ల దండకం చదువుతున్నారు. బతుకు జట్కా బండిలో జీవిత గట్టిగా మాట్లాడుతూ మాస్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

రచ్చబండ లోను రోజా తన స్టైల్లో వార్నింగ్ లు ఇస్తూ టెలివిజన్ రేటింగ్ ని పెంచుతోంది. తాజాగా తమిళంలోనూ ఇటువంటి షో చేస్తున్న కుష్బూ రెచ్చిపోయింది. భార్యాభర్తలు  గొడవపడుతుంటే వారిని ఆపాల్సింది పోయి సహనాని కోల్పోయింది. అసభ్యకరంగా మాట్లాడాడని ఓ వ్యక్తి కాలర్ పట్టుకుని ప్రశ్నించింది. “ఇలాగానే మాట్లాడేది” అంటూ రౌడీలా ప్రవర్తించింది. ఇది లైవ్ షో కాక పోయినా ఆమె ఆవేశపడే సన్నివేశాన్ని ఎడిట్ చేయకుండా అలాగే ప్రసారం చేసి సదరు టీవీ ఛానల్ వాళ్లు బాగా క్రేజ్ ని రప్పించుకుంటున్నారు. ఇటువంటి షోలు సంసారాన్ని చక్కదిద్దుతాయో, లేదోననే సంగతిని పక్కన పడితే అవకాశాలు తగ్గిన నటీమణులకు మాత్రం వీర ప్రతిభను ప్రదర్శించుకోవడానికి మంచి వేదికలవుతున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus