Kushi Collections: ‘ఖుషి’ మొదటి వీకెండ్ ఎలా కలెక్ట్ చేసిందంటే?

విజయ్ దేవరకొండ,సమంత జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. ‘నిన్ను కోరి’ ‘మజిలీ’ ‘టక్ జగదీష్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ లు కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ‘హృదయం'(మలయాళం) ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

టీజర్, ట్రైలర్లకి కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. సెప్టెంబర్ 1 న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ‘ఖుషి’ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో మొదటి వీకెండ్ చాలా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ గమనిస్తే :

నైజాం 11.11 cr
సీడెడ్ 2.01 cr
ఉత్తరాంధ్ర 2.40 cr
ఈస్ట్ 1.26 cr
వెస్ట్ 1.00 cr
గుంటూరు 1.20 cr
కృష్ణా 1.02 cr
నెల్లూరు 0.60 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 20.60 cr
కర్ణాటక 0.77 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.86 cr
ఓవర్సీస్ 7.20 cr
తమిళ్ 0.29 cr
రెస్ట్ 0.32 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 30.04 cr (షేర్)

‘ఖుషి’ (Kushi) చిత్రానికి రూ.50.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.50.55 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.30.04 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.20.51 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus