Laatti Review: లాఠీ సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 10, 2023 / 07:36 AM IST

Cast & Crew

  • విశాల్ (Hero)
  • సునైన (Heroine)
  • ప్రభు, మునిష్కాంత్, తలైవాసల్ విజయ్, మిషా గోషల్ (Cast)
  • ఎ.వినోద్ కుమా (Director)
  • రమణ - నంద (Producer)
  • యువన్ శంకర్ రాజా (Music)
  • బాలసుబ్రమణ్యం - బాలకృష్ణ తోట (Cinematography)

2018లో వచ్చిన “అభిమన్యుడు” అనంతరం విశాల్ ఆరు సినిమాల్లో నటించాడు. అవన్నీ ఫ్లాప్స్ గా మిగిలాయి. దాంతో తాజా చిత్రం “లాఠీ” పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు విశాల్. ముఖ్యంగా ఈ సినిమాలో 20 నిమిషాల యాక్షన్ బ్లాక్ హైలైట్ అని మొదటి నుంచి ప్రమోట్ చేస్తున్నారు. మరి “లాఠీ” సినిమా ఎలా ఉంది?, సదరు యాక్షన్ బ్లాక్ సినిమాకి ప్లస్ అయ్యిందా? అనేది చూద్దాం..!!

కథ: కానిస్టేబుల్ మురళి (విశాల్) చాలా సిన్సియర్ పోలీస్. తనకు తెలియకుండానే సీనియర్ పోలీస్ ఆఫీసర్ కమల్ (ప్రభు)తో కలిసి ఒక హై ప్రొఫైల్ కేసులో ఇన్వాల్వ్ అవుతాడు. ఆ కారణంగా మురళి & ఫ్యామిలీ ఒక కిరాతకుడైన మాఫియా డాన్ కి టార్గెట్ అవుతాడు. ఆ మాఫియా గ్యాంగ్ నుంచి తన కుటుంబాన్ని, తన ఉద్యోగాన్ని మురళి ఎలా కాపాడుకున్నాడు అనేది “లాఠీ” కథాంశం.

నటీనటుల పనితీరు: విశాల్ ఈ తరహా సినిమాలు ఇప్పటికే పదుల సంఖ్యలో చేశాడు. ఒక బాధ్యతగల కానిస్టేబుల్ గా, తండ్రిగా, భర్తగా చక్కగా నటించాడు. యాక్షన్ సీన్స్ లో ఎప్పట్లానే అదరగొట్టేశాడు. ముఖ్యంగా.. క్లైమాక్స్ బ్లాక్ లో విశాల్ పెర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్. ఓ సాధారణ గృహిణిగా సునైన అందంతో, అభినయంతో అలరించింది. ప్రభు సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా తన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: పీటర్ హెయిన్స్ స్టంట్స్ సినిమాకి మెయిన్ & ఏకైక హైలైట్. ముఖ్యంగా అండర్ కనస్ట్రక్షన్ బిల్డింగ్ లో చిత్రీకరించిన చివరి 20 నిమిషాలు బి & సి సెంటర్ ఆడియన్స్ ను విశేషంగా అలరిస్తాయి. సదరు సన్నివేశాలను షూట్ చేసిన విధానం కూడా బాగుంది. అందుకు సినిమాటోగ్రాఫర్స్ బాలసుబ్రమణ్యం – బాలకృష్ణ తోటలను కూడా మెచ్చుకోవాలి. యువన్ శంకర్ రాజా నేపధ్య సంగీతం సోసోగా ఉన్నా.. నేపధ్య సంగీతంతో మాత్రం పర్వాలేదనిపించుకున్నాడు.

దర్శకుడు వినోద్ కుమార్ ఎంచుకున్న కథ చాలా సాధారణంగా ఉండగా.. కథనం చాలా పేలవంగా ఉంది. అందువల్ల ఎంత భారీ యాక్షన్ బ్లాక్ ఉన్నా.. సినిమాగా మాత్రం “లాఠీ” ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా సీన్ కంపోజిషన్ లో కూడా ఎక్కడా కొత్తదనం కనిపించకపోవడం, ఎమోషన్స్ లేకపోవడం, స్క్రీన్ ప్లే చాలా పేలవంగా ఉండడం “లాఠీ” సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. అందువల్ల.. కథకుడిగా, దర్శకుడిగా వినోద్ విఫలమయ్యాడు.

విశ్లేషణ: ఉన్న కొన్ని యాక్షన్ సీన్స్ కోసం థియేటర్లో రెండున్నర గంటలు కూర్చోవడం అనేది కష్టమే. సో, అరడజను ఫ్లాపుల తర్వాత విశాల్ “లాఠీ”తో మరో ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

రేటింగ్: 1.5/5

Click Here To Read in ENGLISH

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus