Pawan Kalyan: ఈసారి పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమంటూ కారణాలు చెప్పిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్..

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు. వచ్చే ఎన్నికల కోసం పక్కా ప్రణాళిక రెడీ చేసుకుంటున్నారు. ఇటీవలే తన ప్రచార రథం వారాహి వాహనానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పూజలు జరిపించారాయన. నటసింహ నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోలో ఫిబ్రవరి 2 రాత్రి 9 గంటలనుండి సందడి చేస్తున్నారు పవన్. ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కానుంది.

ఫస్ట్ పార్ట్ టెలికాస్ట్ చేయగా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ది బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అనేలా భారీ రేటింగ్ దక్కించుకోనుందని అంటున్నారు. మరోవైపు వరుసగా క్రేజీ ప్రాజెక్టులు లైన్‌లో పెడుతున్నారు. ‘సాహో’ సుజిత్ దర్శకత్వంలో చేయనున్న సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో హిస్టారికల్ ఫిలిం ‘హరి హర వీరమల్లు’ చేస్తున్నారు. ఇంకా 40 శాతం షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. దసరాకు విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్.

ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఏపీలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు జనసేనాని సిద్ధమవుతున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ అధికారం దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ మరియు పార్టీ వర్గాల వారు. అయితే పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం.. ఆయన విజయానికి గల కారణాలు ఇవేనంటూ ఓ లేడీ ఫ్యాన్ తన అభిప్రాయాన్ని తెలియజేసింది. అందుకు సంబంధించిన వీడియోను పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus