కీర్తి సురేష్ కి అడ్డుపడ్డ నాయనతార..!

  • February 18, 2019 / 07:00 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇది రజినీకాంత్ కి 166 వ చిత్రం కావడం విశేషం. రాజకీయ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేసారని గత కొంతకాలం నుండీ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘మహానటి’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి సురేష్. తమిళంలో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది.

ఇక మురుగదాస్ గత చిత్రమైన ‘సర్కార్’ లో కూడా కీర్తి సురేషే హీరోయిన్ కాబట్టి… రజిని – మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రంలో కూడా కీర్తి హీరోయిన్ గా ఫిక్సయినట్టే అని చాలా మంది భావించారు. అయితే ఆ వార్తల్లో నిజంలేదని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. మొదట కీర్తి సురేష్ ని హీరోయిన్ గా అనుకున్నప్పటికీ ఇప్పుడు ఆ ప్లేసులో నయనతార వచ్చిందట. ర‌జినీ కాంత్ కంటే కీర్తి వ‌య‌సులో 42 ఏళ్ళు చిన్న‌ది. అందులోనూ ర‌జినీ కూతుళ్ళ కంటే కూడా కీర్తి వ‌య‌సు దాదాపు ప‌దేళ్ళు త‌క్కువ‌. ఇంత త‌క్కువ వ‌య‌సు అమ్మాయితో రొమాన్స్ చేయ‌డం బాగోద‌ని రజినీ చెప్పారట. దీంతో ఇప్పుడు కీర్తి ప్లేసులో . న‌య‌న‌తార‌ని దాదాపు ఖరారు చేసేశారని తెలుస్తుంది. గతంలో రజని, నయనతార ‘చంద్రముఖి’ ‘శివాజీ’ ‘కథానాయకుడు’ వంటి చిత్రాలలో కలిసి నటించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus