‘లక్ష్మీబాంబ్`ఆడియో విడుదల చేసిన దాసరి నారాయణరావు

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమాలక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్మీబాంబ్`. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఆడియో సీడీలను దర్శకరత్న డా.దాసరినారాయణరావు విడుదల చేసి తొలి సీడీని డా.మోహన్ బాబుకు అందించారు. ఈ సందర్భంగా….

దర్శకరత్న డా.దాసరి నారాయణరావు మాట్లాడుతూ – “లక్ష్మి తప్ప నాకు ఈ సినిమా గురించి నాకు ముందు ఏమీ తెలియదు. కానీ సినిమాలోని పాటలు చూసిన తర్వాత, టీం చాలా మంచి సినిమా తీయడానికి, సక్సెస్ ఫుల్ సినిమా తీసిన ప్రయత్నం చేశారని నా సిక్త్ సెన్స్ చెబుతుంది. ప్రేమమ్ సినిమా, సాంగ్స్ చూసి సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆరోజే చెప్పాను. అదే రిజల్ట్ ఈరోజు వచ్చింది. అలాంటి అనుభూతే నాకు ఈ సినిమా సాంగ్స్ చూడగానే కలిగింది. దర్శకుడు కార్తికేయ మంచి స్పిరిట్ ఉన్న కుర్రాడు. ట్రైలర్ చూస్తుంటే లక్ష్మి గెటప్, మ్యూజిక్ విషయంలో దర్శకుడు తీసుకున్న కృషి తెలుసు. నిర్మాతలు సురేష్ రెడ్డి, చంద్రశేఖర్ లకు అభినందనలు. సునీల్ చాలా మంచి సంగీతాన్ని అందించాడు. లక్ష్మి నా బిడ్డ. చిన్నప్పట్నుంచి లక్ష్మి గురించి తెలుసు. స్పాంటేనియస్ నటి. హాలీవుడ్ లో యాక్ట్ చేసింది. నటిగానే కాదు, అన్నీ యాక్టివిటీస్ లో ముందుంది. ఈ సినిమా ట్రైలర్ చూసి లక్ష్మితో రాములమ్మ తరహాలో సినిమా చేయాలనిపించింది. లక్ష్మీబాంబ్ ను దీపావళికి పేల్చబోతున్నారు“ అన్నారు.

డా.మోహన్ బాబు మాట్లాడుతూ – “మురళి నా వద్ద వర్క్ చేశాడు. దర్శక నిర్మాతలు నా వద్దకు వచ్చి ఈ సినిమా చేస్తున్నట్లు చెప్పారు. లక్ష్మి ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదని చెప్పాను. సినిమా రంగంలో పెద్ద చిన్న వారెవరూ లేరు. స్వర్గం-నరకం చేసేరోజున నేను కూడా చిన్నవాడినే. ఈరోజు చిన్నవారే రేపు మంచి స్థాయికి ఎదుగుతారు. అలాగే దర్శకుడు కార్తికేయ పెద్ద దర్శకుడు అవుతాడు. దర్శక నిర్మాతలకు అభినందనలు. సునీల్ కశ్యప్ చాలా మంచి మ్యూజిక్ ను అందించారు. సినిమాలో సాంగ్స్, ట్రైలర్ అన్నీ బావున్నాయి. గుండెల్లో గోదారి సినిమాలో లక్ష్మీ చక్కగా యాక్ట్ చేసింది. ఆ సినిమా కంటే ఈ సినిమాలో లక్ష్మి ఇంకా అద్భుతంగా నటించింది. మా అమ్మాయేనా ఇంత బాగా నటించిందనిపించింది“ అన్నారు.

ల‌క్ష్మీ మంచు మాట్లాడుతూ – “ఈ సినిమా నాకు చాలా స్పెష‌ల్ చిత్రం. ల‌క్ష్మీబాంబ్‌ని ఈ టీమ్ చాలా క‌ష్ట‌ప‌డి చేసింది. కొత్త‌వాళ్లు క‌దా అని అనుకున్నాను కానీ నాకు చెప్పిన‌ట్టు సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్త చేశారు. క‌థ‌ను డార్లింగ్ స్వామి చాలా బాగా నెరేట్ చేశారు. విన‌గానే ఓకే చెప్పేశాను. మా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ ఈ కార్య‌క్ర‌మానికి రావాలంటే ఎంత‌గా ప్లాన్ చేసుకోవాలో చాలా మందికి తెలియ‌దు. అయినా నా అన్న‌ద‌మ్ములు వాళ్ల బాధ్య‌త‌గా ఫీల‌యి ఈ ఫంక్ష‌న్‌కు వ‌చ్చినందుకు థాంక్స్. సినిమాను ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో నేను చాలా బాగా డ్యాన్సులు చేశాను. చాలా షేడ్స్ ఉన్న కేర‌క్ట‌ర్ చేశాను. ద‌ర్శ‌కుడికి, నిర్మాత‌లు ఎక్క‌డా కాంప్రమైజ్ కాకుండా తెర‌కెక్కించారు. ఈ సినిమా చ‌క్క‌గా సాఫీగా జ‌ర‌గ‌డానికి ఈ చిత్ర కో డైర‌క్ట‌ర్ కూడా కార‌ణం. ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు“ అని చెప్పారు.

సంగీత ద‌ర్శ‌కుడు సునీల్ కశ్యప్ మాట్లాడుతూ – “ఈ సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. చాలా మంది పెద్ద‌లు నోటి వెంట నా పేరు వినిపిస్తుండ‌ట‌మే ఆనందంగా ఉంది. ఇందులోని చిట్టిత‌ల్లి అనే పాట‌ను మోహ‌న్‌బాబుగారిని, మంచు ల‌క్ష్మిని దృష్టిలో పెట్టుకునే చేశాను“ అని అన్నారు.

చిత్ర సమర్పకుడు గునపాటి సురేష్ రెడ్డి మాట్లాడుతూ – “ సినిమా చాలా బాగా వ‌చ్చింది. ల‌క్ష్మీగారు మాకు ఇచ్చిన స‌పోర్ట్ మ‌ర్చిపోలేను. సునీల్ కశ్యప్ గారు మంచి సంగీతాన్ని అందించారు. కార్తికేయ సినిమాను అనుకున్న సమయంలో పూర్తి అనుకున్న విధంగా పూర్తి చేశారు. సహకరించిన నటీనటులు, టెక్నిషియన్స్ కు థాంక్స్“ అన్నారు.

చిత్ర దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ – “మంచి స్క్రిప్ట్ ను స్వామిగారు ఇవ్వడంతో ఓ మంచి సినిమాను తీయగలిగాం. సునీల్ డిఫరెంట్ సిచ్యువేషన్ సాంగ్స్ ను అందించారు. సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాతలు పూర్తి సహకారంతోనే సినిమాను పూర్తి చేయగలిగాను. లక్ష్మిగారు నన్ను భరించారు. జోషిగారు, కిరణ్ మాస్టర్, హరి సహా అందరూ బాగా సపోర్ట్ చేశారు. దీపావళి ముందుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాం. క్లైమాక్స్ సీన్, సాంగ్ చాలా బాగా వచ్చింది“ అన్నారు.

వేదికపై అక్టోబర్ 8న మంచు లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు.పోసానికృష్ణ మురళి, హేమ, ప్రభాకర్‌, భరత్‌రెడ్డి, జీవా, అమిత్‌, హేమంత్‌, రాకేష్‌, సుబ్బరాయశర్మ, జె.వి.ఆర్‌, రాజాబాబు, శరత్‌, శ్రీహర్ష, విశాల్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: గునపాటి సురేష్‌ రెడ్డి, డ్యాన్స్‌: కిరణ్‌, ఆర్ట్‌: రఘుకులకర్ణి, ఫైట్స్‌: రాంబాబు, వెంకట్‌, నందు, ఎడిటింగ్‌: నందమూరి హరి, పాటలు: కరుణాకర్‌,కాసర్లశ్యామ్‌, సంగీతం: సునీల్‌కశ్యప్‌, కెమెరా: మల్హర్‌భట్‌ జోషి, కథ, మాటలు: డార్లింగ్ స్వామి, లైన్ ప్రొడ్యూసర్: సుబ్బారావు, ఆర్‌.సురేంద్రరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.మురళి, నిర్మాతలు: వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీ నరసింహ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus