చిన్న సినిమాల్ని బ్రతకనివ్వట్లేదు..!

  • March 9, 2019 / 01:18 PM IST

సినీ ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలను ఎదగనివ్వట్లేదని ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చిన్న చిత్రాలకి థియేటర్లు ఇవ్వట్లేదని .. పెద్ద సినిమా వస్తే చాలు అసలు చిన్న సినిమాకి ఛాన్స్ ఉండదని.. కొంతమంది ఆందోళన వ్యక్తం చేసిన సంగతి కూడా తెలిసిందే. కేవలం ఆ నలుగురి చేతుల్లో మాత్రమే థియేటర్లు ఉంటాయని.. ఇండస్ట్రీలో థియేటర్ మాఫియా ఓ రేంజ్ లో జరుగుతోందని కొందరు నిర్మాతలు తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నటి మంచు లక్ష్మీ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గానూ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తున్న లక్ష్మీ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసిందా అని సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.

ప్రస్తుతం లక్ష్మీ ‘మిసెస్ సుబ్బలక్ష్మి’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్ లాంచింగ్ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన మంచు లక్ష్మీ.. “ఇండస్ట్రీలో థియేటర్లన్నీ ఐదారుగురు చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళను అడిగేవారే లేరు.. కష్టపడి సినిమా తీస్తే.. దాన్ని థియేటర్ నుండి పీకేస్తున్నారు. మోహన్ బాబు కూతురు సినిమా కాబట్టి వారం రోజులైనా థియేటర్ లో ఉంచుదామనే ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి. నేను నటించిన చాలా చిత్రాల్ని సడెన్ గా థియేటర్ల నుండీ తొలగించేశారు. కేవలం ఐదారుగురు చేతుల్లో థియేటర్లన్నీ చిక్కుకుపోయాయి”… అంటూ తన ఆవేదనని వ్యక్తం చేసింది మంచు లక్ష్మీ . ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ టాపిక్ చివరికి ఎటువంటి టర్న్ తీసుకోబోతుందో చూడాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus