తన లవ్ అఫైర్స్ పై క్లారిటీ ఇచ్చిన లక్ష్మీ రాయ్..!

చెప్పుకోవడానికి ఒక్క సరైన బ్లాక్ బస్టర్ కూడా లేకపోయినా.. నటిగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకోనప్పటికీ.. అందాల ఆరబోతతోనే అవకాశాలు దక్కించుకుంటూ అడపా దడపా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది లక్ష్మీరాయ్. ఆఖరికి బాలీవుడ్ లో అడుగుపెట్టి ఓ రేంజ్లో గ్లామర్ డోస్ చూపించినా.. అవకాశాలు మాత్రం దక్కలేదు. దీంతో మళ్ళీ సౌత్ కి తిరిగొచ్చి… తెలుగు , తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ బ్యూటీ కూడా.. ప్రేమ విషయంలో మూడుసార్లు మోసపోయిందట.

ఈ విషయం పై లక్ష్మీరాయ్ స్పందిస్తూ.. “నా పై ఒకటి కాదు, వందల, వేల సంఖ్యలో పుకార్లు వస్తుంటాయి. నేను గర్భవతి అనే ప్రచారం కూడా జరిగింది. చాలా మందితో సంబంధాలు పెట్టుకున్నానని వార్తలు రాస్తున్నారు. ఏ స్త్రీ అయినా.. ఒకరికన్నా ఎక్కువ మందితో రిలేషన్షిప్ చేయగలదా..? అది సాధ్యమయ్యే పనేనా..? ఇవేవీ ఆలోచించకుండా నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నేను ప్రేమ విషయంలో రెండు, మూడు సార్లు మోసపోయిన మాట నిజమే..!, ఆ తరువాత నా తప్పు తెలుసుకొని సంబంధాన్ని తెంచుకున్నాను. ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం సినిమాల పైనే ఉంది”…. అంటూ చెప్పుకొచ్చింది.ఏదేమైనా ప్రేమలో మాత్రం రెండు, మూడు సార్లు మోసపోయాను అని చెప్పి… ఒకరికన్నా ఎక్కువ మందితో రేలషన్షిప్ ఎలా చేయగలను అని చెప్పడమేంటి అని కొందరు సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus