మెగాస్టార్ ని వర్ణించేందుకు పదాలు చిన్న బోతున్నాయ్ – లక్ష్మీ రాయ్

అనుకున్న స్థాయిలో హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయినా అవకాశాలకు కొదువ లేకుండా సాగుతోంది లక్ష్మీ రాయ్ కెరీర్. పేరు మార్చుకున్నా కెరీర్ గ్రాఫ్ లో పెద్ద కదలికలు కనపడలేదు. తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ అడపాదడపా తెలుగులో ఐటెం సాంగ్స్ తో అలరిస్తుంటుంది. ఆ మధ్య ‘సర్దార్’ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కాలు కదిపిన లక్ష్మి రాయ్ ఇప్పుడు ఖైదీ నెం 150 కోసం చిరుతో స్టెప్పులేసింది.

లక్ష్మి రాయ్ చివరి నిమిషంలో కేథరిన్ స్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిరంజీవి, లక్ష్మి రాయ్ లపై ఈ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించారు. ఆ ఆనందాన్ని, అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది రాయ్ లక్ష్మి. మెగాస్టార్ లివింగ్ లెజెండ్ అని ఆయనతో కలిసి నటించడం తన కల అని రాయ్‌లక్ష్మి అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మాటకు ఆయన నిదర్శనమని చెప్పారు. ‘నిజమైన లెజెండ్‌! నేనే ప్రత్యక్ష ఉదాహరణ. రత్నంలాంటి మనిషి, మనసు బంగారం.. ఆయన గురించి చెప్పాలంటే మాటలు పదాలు చిన్నబోతున్నాయి’ అని రాయ్‌లక్ష్మి ట్వీట్‌ చేశారు. దీంతోపాటు ‘ఖైదీ నంబరు 150’ సెట్‌లో చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. చిరంజీవి కుమార్తె సుస్మిత తనని చక్కగా రెడీ చేశారని తెలుపుతూ.. తొలిరోజు షూటింగ్‌లో దిగిన ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ పాటకు లారెన్స్ నృత్యరీతులు సమకూర్చారు. చిరు-లారెన్స్ కాంబినషన్ గురించి తెలిసిందే. డాన్స్ లోని ఆ జోరు ఈ సంక్రాంతికి చూడొచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus