సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఎట్టకేలకు అనేక వివాదాలు, కోర్టు కేసులు, మధ్య నలిగి.. నలిగి విడుదలయ్యింది. అయితే ఏపీలో మాత్రం ఈ చిత్రం విడుదల కాలేదు. అయితే మొదటి షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అనే పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వర్మ. ఇక ఈ చిత్రాన్ని కొందరు మెచ్చుకుంటుంటే… మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కామెడీ ఏమీ లేకపోయినా.. థియేటర్లో ప్రేక్షకులే పెద్ద ఎత్తున కామెడీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుండడం విశేషం.
ఇక ఈ సినిమా కలెక్షన్ల వివరాలు పరిశీలిస్తే.. ఈ చిత్రాన్నితెలుగు రాష్ట్రాల్లో దాదాపు 550 థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినప్పటికీ .. చివర్లో హైకోర్ట్ స్టే ఇవ్వడంతో నైజాంలో 250 థియేటర్స్‌లో మాత్రమే విడుదల చేశారు. ఇక దీని ఎఫెక్ట్ కలెక్షన్ల పై పై పడకుండా ఉంటుందా..? యూ.ఎస్ లో 125 స్క్రీన్స్ లో భారీగా విడుదలైన ఈ చిత్రం మొదటిరోజు అక్కడ మంచి కలెక్షన్స్ ను నమోదు చేసింది. ఒక్క ప్రీమియర్ షోల ద్వారానే 90,214 డాలర్లను రాబట్టడం విశేషం. ఇక ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో శుక్రవారం మరింత జోరందుకుంది. గురు, శుక్రవారాలు కలుపుకొని 145,928 డాలర్ల ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక తెలంగాణాలో కూడా ఈ చిత్రం మంచి కల్లెక్షన్లనే నమోదుచేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ చిత్రం విడుదలైతే అద్భుతమైన కలెక్షన్లు వచ్చేవి అనడంలో సందేహం లేదు.