రంగస్థలం విజయోత్సవ వేడుకలో అందుకే మాట్లాడలేకపోయా : అనసూయ

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం అద్భుత విజయం సాధించింది. నాన్ బాహుబలి రికార్డులన్నిటినీ తిరగరాసింది. అందుకే  శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో సుకుమార్, చంద్ర బోస్, రామ్ లక్ష్మణ్, దేవీ శ్రీ ప్రసాద్ ఇలా అందరూ డ్యాన్సులతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ సినిమాలో “రంగమ్మత్త” గా నటించిన అనసూయ ఈ ఫంక్షన్ కి హాజరయినప్పటికీ ఒక ముక్క కూడా మాట్లాడలేదు.

దీంతో ఆమె అభిమానులు నిరాశ చెందారు. ఇదే విషయాన్నీ ఆమెకు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న అనసూయ తన ఫ్యాన్స్ కి సారీ చెప్పింది. “నేను మాట్లాడతానని ఎదురు చూసిన వారందరికీ ‘సారీ’. నా గొంతు సరిగా లేదు. ఆరోగ్యం కూడా బాగోలేదు. అందుకే మాట్లాడలేక పోయాను. అందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు” అని వెల్లడించింది. రంగస్థలం సినిమాతో అనసూయ మరింత పాపులర్ అయింది. మంచి మంచి పాత్రలు ఆమె కోసం వెతుక్కుంటూ వస్తున్నాయని సమాచారం. మరి ఏ పాత్రలో దర్శనమివ్వనుందో చూడాలి.

Anasuya says sorry

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus