కష్టాన్ని ముందు జేబులో.. అదృష్టాన్ని వెనుక జేబులో పెట్టుకొని వరుసగా ఏడు విజయాలను అందుకున్న హీరో నాని. దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో డిమాండ్ గల హీరోల్లో నాని ఒక్కరయిపోయారు. డిమాండ్ ఉంది కాబట్టే ఒక సినిమాకి 9 కోట్ల పైనే పారితోషికం అందుకున్నట్టు వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అతను తాజాగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించిన “కృష్ణార్జున యుద్ధం” సినిమాకి పదికోట్లు అందుకున్నట్టు టాక్. ఈ చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న నాని ఈ రెమ్యునరేషన్ వార్తలపై స్పందించారు. “నా రెమ్యూనరేషన్ పెరుగుదల అన్నది నా చేతుల్లో ఏమీ ఉండదు.
ఒక సినిమాకు ఎంత బిజినెస్ అవుతోందన్నదాన్ని బట్టి పారితోషకం ఆధారపడి ఉంటుంది. ఆ లెక్కల ప్రకారం మన ప్రమేయం లేకుండానే పారితోషకం పెరిగిపోతుంది. సినిమా ఆడకపోతే తర్వాతి సినిమాకు ఆటోమేటిగ్గా రెమ్యూనరేషన్ తగ్గుతుంది” అని నాని చెప్పాడు. తనకు పారితోషకం అన్నది ప్రధానం కాదని.. తన పనితీరు ఎలా ఉంది.. తన నటనకు ఎలాంటి స్పందన వస్తోందన్నది ముఖ్యమని.. నాని స్పష్టం చేశారు. నేడు రిలీజ్ అయిన “కృష్ణార్జున యుద్ధం” ఫలితం కోసం నాని ఎదురుచూస్తున్నారు.