Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. పూరి, తరుణ్ లకు రిలీఫ్!
- September 18, 2021 / 06:25 PM ISTByFilmy Focus
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్, నటుడు తరుణ్ ల నుంచి సేకరించిన నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్ నివేదికలో తేలింది. పూరి, తరుణ్ లకు సంబంధించిన రక్తం, వెంట్రుకలు, గోళ్లను పరీక్షించిన రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీ ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. డ్రగ్స్ కేసులో ఆరోపణలు రావడంతో 2017 జూలైలో పూరి జగన్నాథ్, తరుణ్ ల నుంచి ఎక్సైజ్‌శాఖ నమూనాలు సేకరించింది. వీరిద్దరూ కూడా స్వచ్ఛందంగానే రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చారని ఎక్సైజ్‌శాఖ అధికారులు వెల్లడించారు.

దీనిపై గతేడాది డిసెంబర్ 8న ఎఫ్ఎస్ఎల్ నివేదికలు సమర్పించినట్లు ఎక్సైజ్‌శాఖ తెలిపింది. కెల్విన్ పై ఛార్జ్ షీట్ తో పాటు ఎఫ్ఎస్ఎల్ నివేదిక వివరాలను కోర్టుకి సమర్పించినట్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు వివరించారు. పూరి సినిమాల విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించారు. ఇక తరుణ్ కెరీర్ విషయానికొస్తే.. ఆయనకు సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో నిర్మాతగా మారే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్.
నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!














