క్లాసీ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న ఎన్టీఆర్

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నసంగతి తెలిసిందే. ఇందులోని నెగటివ్ క్యారక్టర్ అయిన జై కి సంబంధించిన టీజర్ గత వారం రిలీజ్ అయి అభినందనలు అందుకుంది. ఈ చిత్రంలోని హీరో పాత్ర అయినా లవ కుమార్ టీజర్ ని రాఖీ సందర్భంగా ఈ రోజు రిలీజ్ చేస్తామని ఇంతకముందు చిత్ర బృందం ప్రకటించింది. అయితే టీజర్ కాకుండా ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. లవ పాత్రలో సూపర్ క్లాస్ గా ఎన్టీఆర్ ఉన్నారు. రెండు పోస్టర్స్ లో ఫార్మల్ షర్ట్స్, ట్రిమ్ బియర్డ్స్ తో అందంగా నవ్వుతూ ఆకట్టుకున్నారు.

ఈ లుక్ నందమూరి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. కుశకు సంబంధించిన టీజర్ ఎలా ఉండబోతుందోనని ఇప్పటి నుంచే అంచనాలు పెరిగాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వందకోట్ల బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా నివేదా థామస్, రాశీ ఖన్నా, నందిత రాజ్ లు నటించనున్నారు. హ్యాట్రిక్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21 న థియేటర్లలో రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus