నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్న నిహారిక, లావణ్య, రీతూ వర్మ ల ఫోటోలు..!

కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల.. టాలీవుడ్ కు పెళ్ళి కళ వచ్చిన సంగతి తెలిసిందే. నిఖిల్, నితిన్, రానా వంటి యంగ్ హీరోలు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారయ్యారు. ఇక మెగా డాటర్ నిహారిక ఎంగేజ్మెంట్ కూడా ఈ లాక్ డౌన్ టైంలోనే జరిగింది. గుంటూరు ఐజీ అయిన ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక ఎంగేజ్మెంట్ జరిగింది. డిసెంబర్‌లోనే వీరి పెళ్లి జరగబోతుందని..నిహారిక తండ్రి నాగబాబు కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేసారు.

తన కొడుకు వరుణ్‌ తేజ్.. నిహారిక పెళ్లి పనులు చూసుకుంటున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ హీరోయిన్లైన లావణ్య త్రిపాఠి మరియు రీతూ వర్మలకు నిహారిక స్పెషల్ పార్టీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.మొన్ననే తన బెస్ట్ ఫ్రెండ్స్ కు గోవాలో బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చి వచ్చింది నిహారిక. తాజాగా టాలీవుడ్‌ హీరోయిన్లైన లావణ్య, రీతూ లకు కూడా స్పెషల్ పార్టీ ఇచ్చింది. సినీ ఇండస్ట్రీలో లావణ్య త్రిపాఠి తన బెస్ట్ ఫ్రెండ్ అని గతంలో ఓసారి నిహారిక చెప్పిన సంగతి తెలిసిందే.

తన అన్నయ్య వరుణ్ తేజ్ తో రెండు సినిమాలు చేసిన లావణ్యతో తనకు మంచి ఫ్రెండ్ షిప్ ఉన్నట్టు కూడా ఆ సందర్భంలో నిహారిక తెలిపింది. ఈ లిస్ట్ లోకి తాజాగా రీతూ వర్మ కూడా చేరినట్టు ఈ ఫోటోలు స్పష్టంచేస్తున్నాయి.’నేను అస్సలు ఊహించలేదు. చాలా బాగుంది. లవ్‌ యు లావణ్య, రీతూ, అనితా రెడ్డి’ అంటూ నిహారిక ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కామెంట్లు పెట్టింది.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus