Salman Khan: బిష్ణోయ్ వర్గానికి సల్మాన్ ఏం ఆఫర్ చేశాడు..?

సల్మాన్ ఖాన్‌తో ( Salman Khan) లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మధ్య నెలకొన్న వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. లారెన్స్ బిష్ణోయ్, ప్రస్తుతం సబర్మతి జైలులో ఉన్నా, సల్మాన్ ఖాన్‌పై వరుసగా బెదిరింపులు పంపడమే కాకుండా, అతడి గ్యాంగ్ సల్మాన్ ను హత్య చేస్తామని బహిరంగంగా హెచ్చరించింది. ఈ సంఘటనల వెనుక కారణం బిష్ణోయ్ వర్గం కృష్ణజింకను పవిత్ర జంతువుగా భావించడం. తాజాగా లారెన్స్ బంధువు రమేష్ బిష్ణోయ్, ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Salman Khan

సల్మాన్ ఖాన్ ఒకప్పుడు బిష్ణోయ్ వర్గానికి డబ్బు ఆఫర్ చేశారని రమేష్ తెలిపారు. “సల్మాన్ జింకను చంపి తెగప్పు5చేశాడు, ఆ తరువాత డబ్బు సర్దుబాటు చేయడానికి ప్రయత్నించాడు. ఆయన తండ్రి సలీం ఖాన్ ‘బ్లాంక్ చెక్’ ఇవ్వాలని సలహా ఇచ్చారని, చెక్‌లో ఇష్టం ఉన్నంత రాసుకోండి అని కూడా చెప్పారు,” అని రమేష్ వెల్లడించారు. అయితే, బిష్ణోయ్ వర్గం ఆ డబ్బును తిరస్కరించి, సల్మాన్ చేసిన తప్పు క్షమించడానికి సిద్ధంగా లేదని స్పష్టంచేశారు.

“మాకు డబ్బు అవసరం ఉన్నట్లయితే, అప్పుడే ఆ ఆఫర్ తీసుకునే వాళ్లం. కానీ, కృష్ణజింకను వేటాడటం మా సమాజాన్ని అగౌరవపరిచిన చర్యగా భావించాం. ఈ విషయమై కోర్టు ద్వారా పోరాడాలని నిర్ణయించాం,” అని రమేష్ వివరించారు. లారెన్స్ బిష్ణోయ్, ముంబైలో సల్మాన్ నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటన, తర్వాతి బెదిరింపులు, ఇవన్నీ ఆయనకు ఇంకా ప్రమాదం ఉందని తెలుపుతున్నాయి. ప్రస్తుతం సల్మాన్ షూటింగులకు కూడా 100 మంది భద్రతా సిబ్బంది మధ్య వెళ్లిపోతున్నారు.

అంతేకాకుండా, సల్మాన్ స్నేహితుడు సిద్ధిఖ్ హత్య తర్వాత ఈ వివాదం మరింతగా తీవ్రతరం అయ్యింది. లారెన్స్ గ్యాంగ్‌కి చెందిన 18 మందిపై పోలీస్ కేసులు నమోదు చేయడం, ఈ వ్యవహారంలో ఉన్న ఉత్కంఠను మరింత పెంచింది. మొత్తానికి సల్మాన్, బిష్ణోయ్ వర్గం మధ్య వివాదం ఇంకా సులభంగా పరిష్కారం కాకపోవడం, రాబోయే రోజుల్లో కొత్త మలుపులు తిరగనుందా అన్న ఆసక్తిని కలిగిస్తోంది.

మరో రేర్ ఫీట్ అందుకోబోతున్న బాలయ్య..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus