‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో లయ పాత్ర ఏమిటంటే ?

మాస్ మహారాజ్ రవితేజ  ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో  “నేల టికెట్” సినిమా చేస్తున్నారు.  దీని తర్వాతి శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ అమెరికాలో రవితేజ లేకుండా సాగుతోంది. అను ఇమ్యానుయేల్ ఒక హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు  మొత్తం యునైటెడ్ స్టేట్స్ లొనే జరగనుంది. న్యూయార్క్, డెట్రాయిట్, సాల్ట్ లేక్ సిటీ, ఇతర లొకేషన్స్ లో చిత్రీకరించనున్నారు.  స్టార్ కమెడియన్ కమ్ హీరో సునీల్ ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్  చేయనున్నారు.

అంతేకాదు ఈ చిత్రంలో నిన్నటితరం హీరోయిన్ లయ కూడా నటిస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వెండితెరపైకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె ఈ సినిమాలో పోషించే రోల్ ఏంటో బయటికి వచ్చింది. హీరోయిన్ అను ఇమ్యానుయేల్ కి తల్లిగా నటించనున్నట్టు సమాచారం. వారిద్దరి కాంబినేషన్ సన్నివేశాలను శ్రీనువైట్ల ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు.  మైత్రి మూవీ మేకర్స్ వారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ లో త్వరలోనే రవితేజ జాయిన్ అవుతారు. గతంలో శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్లో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను సూపర్ హిట్ అయ్యాయి. వారి కాంబోలో వస్తున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. గత కొంతకాలంగా హిట్ లేక విలవిలలాడుతున్న శ్రీనువైట్ల ఈ చిత్రంతో హిట్ ట్రాక్ లోకి వస్తారని భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus