చిరు, పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన ఎల్బీ శ్రీరామ్!
- October 28, 2017 / 06:02 PM ISTByFilmy Focus
తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన అద్భుతమైన రచయితల్లో ఎల్బీ శ్రీరామ్ ఒకరు. ఆయన ఎక్కువమందికి టాలీవుడ్ లోని హాస్యనటుల్లో ఒకరిగా తెలుసు. ప్రస్తుతం కొత్త నీరు పరిశ్రమలోకి రావడంతో నటన, రచన ను కొత్త ఫ్లాట్ ఫామ్ ని ఎంచుకున్న ఎల్బీ శ్రీరామ్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భయం లేకుండా స్టార్ హీరోల గురించి వివరించారు. ప్రముఖుల గురించి సింగిల్ లైన్ లో చెప్పమంటే వరుసగా, వేగంగా తడుముకోకుండా చెప్పారు. ఆ సెలబ్రిటీ పేరు – ఎల్బీ శ్రీరామ్ సమాధానం ఎలా ఉన్నాయంటే..
పవన్ కళ్యాణ్ : జంఝా మారుతం
దర్శకుడు ఈవీవీ : ఎవరెస్ట్
చిరంజీవి : ఇంద్ర.. మెగా సింహాసనం
దర్శకుడు కె. విశ్వనాథ్ : కళాతపస్వి.. దాదా సాహెబ్ యశస్వి.. అన్నింటినీ మించి ఆయన ఎప్పటికీ ‘శంకరాభరణం’.
క్రిష్ : మట్టికి, మనిషికి ఉన్న సంబంధం
రాజమౌళి : తిప్పరా మీసం
పరుచూరి బ్రదర్స్ : సంచలనం
బ్రహ్మానందం : హాస్య విశ్వరూపం
అంటూ తనలోని రచయితను బయటపెట్టారు. మరి మీ గురించి చెప్పమంటే మాత్రం ఒక వాక్యంలో వివరించారు. “నేనొక చీమని.. అలా వెళుతూ ఉంటాను.. పంచదార పలుకో , బియ్యపు గింజనో మోసుకుంటూ వెళ్లి ఎవరికైనా పెట్టడానికి చూస్తుంటాను” అంటూ కవితాత్మకంగా తన గురించి ఎల్బీ శ్రీరామ్ చెప్పారు.

















