LCU: ఏకంగా 2000 కోట్లకు లోకేష్ టార్గెట్?

సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)  పేరు ప్రథమంగా వినిపిస్తోంది. మాఫియా బ్యాక్‌డ్రాప్ కథలు, యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్స్ తో వరుసగా హిట్లు కొడుతున్న లోకేష్, ‘లియో’(LEO)  సినిమాతో మంచి వసూళ్లు సాధించారు. ‘లియో’ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ, 600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం లోకేష్, సూపర్ స్టార్ రజనీకాంత్  (Rajinikanth) తో ‘కూలీ’ (Coolie)  మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2024 మధ్యలో విడుదలకు సిద్ధమవుతుందని తెలుస్తోంది.

LCU

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) ని ‘ఖైదీ’తో (Kaithi) ప్రారంభించిన తర్వాత, ‘విక్రమ్’ (Vikram), ‘లియో’ వంటి భారీ ప్రాజెక్టులను రాబట్టారు. ఇపుడు మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ‘ఖైదీ 2’ మరియు ‘విక్రమ్ 2’ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేస్తున్నారు. విక్రమ్ లో సూర్య  (Suriya)  చేసిన రోలెక్స్ పాత్ర కూడా కొత్త కథతో వస్తుందని స్పష్టం చేశారు. LCU లో ఈ ప్రాజెక్ట్స్ తో పాటు, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో (Aamir Khan)  కూడా సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అమీర్ ఖాన్ తో భారీ బడ్జెట్ మూవీ రూపొందించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి లోకేష్, నిర్మాతలు, హీరో మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అఫీషియల్ ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ 2026లో ప్రారంభం అవుతుందని వినిపిస్తోంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ తన ‘సితారే జమీన్ పర్’ సినిమాతో బిజీగా ఉన్నారు, ఆ చిత్రం విడుదల అనంతరం లోకేష్ తో ప్రాజెక్ట్ ప్రారంభించవచ్చని అంటున్నారు.

2000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో ఈ సినిమాని రూపొందించాలని మైత్రీ మూవీ మేకర్స్, లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నారని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. గతంలో ‘దంగల్’ సినిమాతో 2000 కోట్ల క్లబ్ లో చేరిన అమీర్ ఖాన్ ఈ సారి కూడా అదే స్థాయిలో వసూళ్లు రాబట్టవచ్చని భావిస్తున్నారు.

ఇండియాలో ఇప్పటి వరకు 2000 కోట్ల క్లబ్ లో చేరిన సినిమా తక్కువే, అందుకే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కూలీ’ సినిమాలో కూడా అమీర్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఆ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఈ విధంగా LCU లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన కొత్త స్టోరీలతో ప్రేక్షకులను అలరించడానికి లోకేష్ సిద్ధమవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus